ఈ కథలబడి నా కథా రచన దృక్పధాన్ని అనుసరించి రాయబడింది.
తెలంగాణ రాష్ట్రంలో 89 శాతంగా గల బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ప్రజల జీవితం, సంస్కృతి, పఠనాసక్తి, మానవ సంబంధాలు ఉదాత్తంగా సాహిత్య విలువలతో ఎదగడానికి అనువుగా రూపొందించబడింది.
ఇతర కథన రీతులను కూడా పరిచయం చేయడం జరిగింది.
బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలు రాయడానికి, అదేవస్తువు గురించి ఇతరులు రాయడానికి మధ్య ప్రెసెంటేషన్ లో, దృక్పథంలో, జీవితాలను, సంస్కృతిని, చూసే చూపులో, వైవిద్యం వైరుధ్యం, భిన్నత్వం, వక్రీకరణలు ఎలా ఉంటాయో ఉదాహరణ ప్రాయంగా, తులనాత్మకంగా ఇందులో విశ్లేషించడం జరిగింది.
- బి. యస్. రాములు