Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹65

దళారి

“నమస్కారమన్నా రామప్పన్నా.... రారా, యేం శానా దినాలకొస్తివే, పంటలన్నీ బాగనే ఉండాయేమన్నా?" చాలా ప్రేమగా అడిగాడు లారీ బ్రోకరాఫీసులో ఫోన్ దగ్గర కూర్చున్న సుబ్బరాయుడు,

“ఏం బాగులేప్పా, సెప్పుకుంటే సిగ్గు బోతాది” అంటూ తలకు చుట్టుకొన్న టువ్వాలు తీసి భుజం మీద వేసుకొని, బ్రోకరాఫీసులో పక్కనున్న బెంచీ మీద కూచ్చున్నాడు. రామప్ప, అతని పక్కనే ఇంకా ఇద్దరు ముగ్గురు రైతులు ముందే కూర్చొన్నారు.

"అదేమన్నా, అట్లంటావ్? ఈసారి వాన్లు బాగొచ్చినాయి గదా” మాటల్లోకి దిగాడు సుబ్బరాయుడు.

“వాన్లు బాగానే వచ్చినాయనుకో, అయితే యేం జేత్తావ్? పైర్లకంతా నున్నగ రోగాలు, టమేటా, ఉల్లిగడ్డ యేసుకున్న మాయల్లా రైతుల గతి ఆ దేవునికే దెల్సు. అంబంలో కుంబమని రేట్లు జూతామంటే ముండ మోసినాయ్. అంతో యింతో టమేటా వతావుంటే దాన్ని అడిగే నాతుడే లేదు. మార్కెట్టుకు పది గంపలు టమేటా యేసకొస్తే కమీసనూ గిమీసనూ | పొయ్ యాభై రూపాయలు సేతికొస్తే దాంట్లో శార్జిలేమీ, పీకిన కూల్లేమి, గంపల కరీదేమి? | కరువులో అధిక మాసమన్నట్లు అదేందో గంపకు పావలా దానమంట.... ఇంగ వుల్లిగడ దనుకుంటే అంతా గబ్బుగబ్బు లేప్పా. నాటినప్పట్నుండే సన్నబిల్లోన్ని జూసుకున్నట్లు సూసుకొని కాపాడుకొంటే తీరా నోటికొచ్చినంక ఈ గబ్బు నాకొడుకు వానతో యాడిదాడ కుళ్ళుతాంది.. భూమిలో ఉండేది భూమిలోనే. పీకింది పీకినట్లే, తరిగింది తరిగినట్లే కుళ్ళిపోతాంటే ఇంగేమి |

లుకుండేది! యాలెపులలేప్పా, రైతు బతుకే అద్దుమాన్న మయిపోయింది" లోనును బాధనంతా బయటకి కక్కేసి నిట్టూర్చాడు రామప్ప

"రైతు బతుకే గాదు, అందరీ అట్లే అయిపోయిందిలేన్నా" ఓదార్చాడు సుబ్బరాయుడు.

"మీకేమప్పా, మారాజులూ! వానా లేదని బాధుందా, ఇత్తనాలెయ్యల్లని బాదుందా తెలుపుదియ్యల్లని- మందు గొటలని బాదుందా! ఆయిగ నీడపట్టున కాలిమీద కాలేసుకొని పాయిస్తారు. మీకేం బాద నాయనా?" పట్నంవాళ్ళ సుఖాన్ని ఎత్తి చూపాడు రామప్పు,

"అదేమన్నా, మీరు బాధపడితే మాకూ బాధే కదా! ...మీ యట్లాంటి రైతులందరూ బాగుంటేనే మేము బాగుండేది, మా వ్యాపారం సాగేది..... ఇంతకూ ఉల్లిగడ్డ పంట

యామాత్రమన్నా?"..............