Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
కయ్య - కాలవ
లక్ష్మమ్మ గొప్ప అదృష్ట జాతకురాలు. పాకనాటి కాపుకులంలో పుట్టింది. మళ్ళా అపర మహాలక్ష్మే. పూర్వ జన్మలో ఇంత పెట్టిపుట్టిందేమో, ఈ జన్మలో భోగం అనుభవిస్తోంది.
లక్ష్మమ్మ పుట్టింటి వారిది చాలా గట్టిసంసారం. మొగపిల్లకాయలు లేనందువల్ల లక్ష్మమ్మకూ, ఆవిడ అక్కకూ ఒక వూళ్ళోనే మనువులు కుదిర్చి తండ్రి ఇద్దరికీ చెరి ముప్పయి. వేల రూపాయల ఆస్తి ఇచ్చి మహా వైభవంతో వివాహం చేసి, వాళ్ళను కాపురానికి పంపేడు. కాని కాపరానికి వెళ్ళిన మరుసటి సంవత్సరమే లక్ష్మమ్మ భర్త కాలం చేసినందువల్ల అప్పటి నుంచీ ఇప్పటివరకూ ఆవిడ నిరంకుశమైన వైధవ్యాన్ని అవిచ్చిన్నంగా పరిపాలిస్తోంది. ఇదొక్కటే ఆవిడకు కొరత పెట్టాడు భగవంతుడు. ఇది మినహా ఆవిడ సంసారానికి ఏమీ కొరతలేదు.
అటు పుట్టింటివారివల్ల దఖలుపడ్డ ముప్పయివేల రూపాయల ఆస్తి, యిటు అత్తింటివారివల్ల లభ్యపడ్డ ఏభై వేల రూపాయల ఆస్తీ కలిపి, భర్త చనిపోయేటప్పటికి ఓ 80, 90 వేల రూపాయల ఆస్తికి లక్ష్మమ్మ హక్కుదారయింది. చనిపోయే ముందు మంచంమీద ఇంకా తెలివుండగానే భర్త సిసలైన వీలునామా వ్రాసి ఏభై ఎకరాల మాగాణి, డెబ్బై ఎకరాల మెట్టా, మామిడితోటా, నాలుగెకరాల పాటి మట్టి దొడ్లీ, పశువుల బీళ్ళూ, పది అంకణాల | మద్ది, ఇన్ని పాడిపశువులూ, నాలుగువందల సన్నజీవాలూ ఒకటేమిటి, ఒకరి దగ్గరకు పోనక్కర లేకుండా అమర్చి పెట్టినట్లు ఇనప్పెట్లో బీగాలతో సహా చేతిలో పెట్టి, “నేను లేనన్న కారతతప్ప యిక నీకేమీ లోపం లేదు. ఇంట్లో తల అట్లా వీధిలో పెట్టుకోకుండా ఈ యావదాస్తే నువ్వు అనుభవించు కొని జీవించు" అని అంత్యకాలాన ఆశీర్వదిస్తూ ఆవిడ భర్త! అదృశ్యమైనాడు.
లక్ష్మమ్మది మొదటి నుంచీ గట్టిపిడికిలి. పొలంలో పండిన అరవై పుట్ల ధాన్యం ఆగాయత్తు దొడ్లో పశువులు వేసే పేడవరకూ సమస్తమూ ఆమె రొట్ట రూపంగా మార్చి |
చేసిన సంసారం అది. రాగులు, సజలు, జొన్నలు, మిరపకాయలు, చింతపండు. అదికాయలు, టెంకాయలు, టెంకాయపీచు. తాటికాయలు, తాటాకు, తాటిబుర్రలు.
పరుగు, వెన్న, నెయ్యి ఒకటేమిటి. పాటి మట్టి, ఎరువుమట్టి, దూడా దుడుకూ సమస్తమూ - మార్చి చేతపటుకొనే అలవాటు లక్ష్మమ్మకు. అందువల్ల భూములు, దొడ్డు, బంగారు..............