Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
కుటీర లక్ష్మి
కార్తీకమాసము ప్రారంభమై పదునాల్గు దినములైనది. సుధాకరుఁడు దిన దినము కళాభివృద్ధి నందుచుఁ దనసాంద్రశీతల కిరణములచే జగజ్జనుల గడగడ వణకింపు చున్నాఁడు.
దివ్యసౌధములలో గాలి చొరకుండ గవాక్షములను తలుపులను బిగించుకొని యున్ని చొకాయలు తొడిగికొని పచ్చడములఁగప్పుకొని తనువును, విశ్వమును మఱచి గుజ్జులుపెట్టి నిద్రపోవు ధనాడ్యులకు శీతకాలమంత సౌఖ్యమైన కాలము లేదు. కాని మిక్కుటంపు చలిలో నొడలు నిండ బట్టలేక దట్టమైన కొంపలేక నల్లాడు బీదజనులస్థితి మాత్రము హృదయ విదారకముగ నుండును.
పేదలు సాధులు పథికులు నలమటించెడు నా శీతరాత్రివేళ రామలక్ష్మి కప్పు కొంత వోయిన చుట్టుగుడి సెయందుఁ దనయిరువురుబిడ్డల నొక తాటియాకుల చాపపై నిరుప్రక్కలం బరుండ పెట్టుకొని “అమ్మా చలే” యని బిడ్డలరచినప్పుడెల్ల “నా చిన్నియన్నలారా! నన్నుఁగట్టిగా గౌఁగిలించుకొనుడు. ఈ ప్రపంచములో మీ కున్నధనమెల్ల నీ నిర్భాగ్యపుతల్లి యొక్కతయే గదా?" యని కన్నీరోడ్చుచు దగ్గుత్తికతో బల్కుచునవ్వారిగా వెడలుచున్న కన్నీటిధారల పైట పేలికల నద్దుకొనుచు నా గభీరశీతరాత్రిని వేగించుచుండెను. రాత్రి మూఁడుగంట అతిక్రమించి నది. హోరుమని యీదరగాలి యెక్కువైనది. గోడ కొత్తగిలి పరుండిన రామలక్ష్మికిని యామె బిడలకును చంద్రు డభిముఖుఁడైనాఁడు. చల్లని యాచంద్రకిరణములు రామలక్ష్మి మీఁదను నామె యిద్దరుబిడ్డలమీఁదను సోకినవి. ఆ యీదరగాలి కా చంద్ర కిరణప్రసారము నకు చలి మిక్కుటమైనది. చలిబాధకు తాళలేక రామలక్ష్మి చిన్న కుమారుఁడగు రంగఁడు "అమ్మా! 'చలే" యని పెద కేక పెట్టెను, "కేక వేయకు నాయనా!" యని రామలక్ష్మి యాబిడను దగ్గరకు లాగఁబోయినది. బిడ్డ యొడలు కొయ్యవలె గట్టిగాఁ జేతికిఁ దగిలినది. అంత రామలకి, "అయ్యో! బిడ కొయ్యలాగున్నాఁడే" యనియాతురతతో "రంగా, రంగా" యని రెండుమాఱులు గట్టిగా పిలిచినది. రంగడు పలుకలేదు. రామలక్ష్మి గుండె లవిసి పోయినవి. "అయో నాయనా! పలుకవేమిరా?" యని రామలక్ష్మి పెద్దగ నేడ్వసాగినది. తలి రోదన మునకుఁ బెదకుమారుఁడుగూడ మేల్కొని "అమ్మా! యందు కడ్చుచున్నా? " వనెను. "నాయనా! తమ్ముందు బిగిసికొని పోయినాఁడు. మాటలేదు. ప్రాణమున్నట్లు లేదురా "యని............