Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
అందరి కోసం ఈ ప్రేమ అక్షరాన్ని ప్రేమించే వారిని ప్రోత్సహించి రచయితను చేయవచ్చు. కానీ కవిని చేయలేం. కవి ఎప్పుడూ సమాజము, సమాజంలోని మనుషులు, సంఘటలను చూస్తూ, స్పందిస్తూ, ఫీల్ అవుతూ, ఆలోచిస్తూ, అన్వేషిస్తూ వాణ్ణి వాడే తయారుచేసుకుంటాడు. మనం వాణ్ణి గుర్తించి రిసీవ్ చేసుకోవాలి అంతే. సాహిత్యాన్నైనా మనం ఓన్ చేసుకోవాలంటే... అది మనపై అంత బలమైన ముద్ర వేయాలి. అలా ఓన్ చేసుకున్న దేన్నీ మనం మర్చిపోలేం. రాసిన వాళ్ళకంటే చదివినవాళ్లే ఎక్కువగా దాన్ని సొంతం చేసుకున్నారంటే ఆ సాహిత్యం సమాజపరమైందని అర్థం. కీట్స్, నెరుడా రాసిన కవితా పాదాలు సింపుల్ గా కనిపించవచ్చు. కానీ వాటిని మనం ఓన్ చేసుకున్నాం. అంతగా సమాజం సొంతం చేసుకోవడం మిగతా ప్రక్రియల కంటే కవిత్వానికే ఎక్కువ సాధ్యమవుతుంది........... |