Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹130

                     చిరంజీవి డా. నారాయణరెడ్డి మాకు పుత్రప్రాప్యపరాజయానందము కలిగించిన శిష్యచూడమణి. అతని హృన్మర్దవమును వాఙ్మధుర్యమును గ్రహించి వలచి కవితాకన్య స్వయముగా వరించినది. ఆమె పులపుజూపుల పాలవెల్లిలో నోలలాడి యతడు సరసమధురములైన కబ్బములు పెక్కు సృజించి యాంధ్రభాషయేష కాభినవలంకృతులు కల్పించినాడు. ఆ యలంకారముల కమనీయ కాంతులతో నతని యశస్సౌరభములు తెలుగు నేల నలువలంకుల నలముకొని రసికజన హృదయారవిందముల  నానంద మకరంద తుందిలముల  నొనరించినవి . అతని కవిత్వపు వేఱుగులు సహృదయులకు కర్ణభూషణములు, గురువులైన మాకు గర్వకారణములునైనవి .