సంగీత మహాసముద్రం. దూరంగా నిలుచుని ఇదిగో చూడండి, ఈ మహాసముద్రాన్ని అని చెప్పడానికికూడా నాకు శక్తి చాలదు. సమగ్రంగా సంగీత శాస్త్ర జ్ఞానం సంపాదించడానికి నాలాంటి సామాన్యునికి ఈ జీవితం చాలదు. ఇంగువకట్టిన గుడ్డలా ఎంతో కొంత సంగీత వాసన అబ్బడానికి కారణం సుప్రసిద్ధ మృదంగవిద్వాంసులుగా ఉండి, ఆదిభట్ల నారాయణదాసు గారికి మిత్రులై వారి హరి కథలకు మృదంగం వాయించేవారు. మా తాతగారైన పొట్లూరి హరిపురుషోత్తం గారు కూడా మృదంగ విద్వాంసులై వుండడం వారి కుమార్తె కడుపున జన్మించడం వల్ల, వినికిడి వల్ల నాకు నాలుగునుడుగుల సంగీతజ్ఞానం అబ్బి ఉండవచ్చు.
- డా. చల్లా విజయలక్ష్మి