Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹100

                                  అడుగుజాడ గురజాడది కనుక ఆధునిక రచయితలముందరం అప్పారావుగారి దగ్గర్నుంచే అభ్యుదయభావాలు పెంచుకోవడం మొదలెట్టాం. అప్పారావుగారి మంచితోపాటు వారి హాస్యానికికూడా వారసత్వాన్ని ప్రకటించుకున్న ఒకానొకడు బహుశా ఒకడే ఒకడు, ముళ్ళపూడి వెంకటరమణ మాత్రమే.

                               సులభంగా రాయడం అలవర్చుకోడం ఎంత కష్టమో , సున్నితమైన హాస్యంతో జీవితాన్ని రంగరించడంకూడా అంతకష్టమే. "ఆద్యంతం నవ్వు తొణికిసలాడేటట్టు గంభీరమైన ఇతివృత్తాన్ని నడిపించడం అంత తేలికైన విషయం కాదు" అని అప్పారావుగారు ఒక సారి హెచ్చరించారు. ఈ సంగతి ముళ్ళపూడి వెంకటరమణకు స్వానుభవమే. లోపల ఎంత బడబాగ్ని ఉన్న సముద్రజలాలు శీతలలు. చేదు సత్యాలకు మంచి నవ్వుల పంచదారపాకం పట్టించడం ఆ సత్యాలను అయినవాళ్ళచేత తినిపించాలి తాపత్రయపడేవారికి చాల అవసరం.