బిడ్డల తొలి చదువుల్లో టోకుగా అశాస్త్రీయ పద్ధతులు రాజ్యం ఏలుతున్న నేటి తరుణంలో, శాస్త్రీయ విద్య ఎలా ఉంటుందో చర్చకు తేవాల్సిన అక్కర ఎంతైనా ఉంది. ఇందులో భాగంగా జవాబు దొరకాల్సిన కొన్ని ప్రశ్నలు., చదువంటే మార్కులు, ర్యాoకులు అనే భావం జనంలో ఎందుకు నాటుకు పోయింది ప్రైవేటు బడుల్లో పైకి కనిపించే నాణ్యమైన చదువుల నిజ స్వరూపం ఏమిటీ? విద్యా రంగంలో కార్పొరేట్ సంస్థలు ఎలాంటి పాత్ర పోషిస్తున్నాయి? విద్యా ప్రమాణాల పతనానికి కనపడని కారణాలు ఏమిటీ? ఎండమావి చదువుల కోసం పిల్లల్ని ఎందుకు పరుగులు పెట్టిస్తున్నాము? పిల్లల్లో వ్యక్తిత్వ వికాసం, సామజిక పరిణతి, సర్దుబాటు, జీవన మెలకువలు, భాషా నైపుణ్యం, మాటకారితనం లోపించటానికి కారణాలు ఏమిటీ? లాంటి అనేక ప్రశ్నలకు ఈ పుస్తకంలో జవాబు దొరుకుతుంది. మేడి పండులా కన్పిస్తున్న నేటి చదువుల పొట్ట చిదిమి చూపటమే కాక, తొలి చదువుల్లో, పాటించాల్సిన శాస్త్రీయ బోధనా పద్దతులను చర్చకు తెస్తుంది.
- డా. పామిడి శ్రీనివాస తేజ