కాలభైరవ తంత్రం పాఠకులకు ఒక ముఖ్య సూచన 1. ఈ పుస్తకమును ముందు శ్రద్ధగా చదవండి,
- మీరు ఏ మంన్ని అయినా ఉపోసించాలనుకున్నప్పుడు సరియైన వ్యక్తిని గురువుగా భావించి వారి సలహాతో ఆ మహామంత్రమును, లేక మాలా మంత్రమును లేక స్తోత్రమును లేక కవచమును ఉపాసన చేయండి.
- రచయితనైన నేను ప్రియమైన పాఠకులకు భక్తులకు తెలియజేయునదేమన, ఈ గ్రంథమును నా ఉపాసన బలంతోను, దేవతల గురువుల అనుగ్రహముతో మాత్రము వ్రాశానని మనవి చేస్తున్నాను. నా 'తెలివి తేటలతో వ్రాసివుంటే మిగతా రచయితల దేవతా గ్రంథాలలాగే ఉండేది.
- అనుష్టాన లేక ఉపాసన లేక ధ్యాన జప మరియు నియమాల విషయంలో అవసరమైతే రచయితనైన నన్ను సంప్రదించగలరు. శక్తిమేరకు సలహా ఇవ్వగలవాడును.
- ఈ గ్రంథములోని మంత్రాలన్నీ ఋషి ప్రోక్తమైనవిగాన శ్రద్ధ భక్తితోబాటు సద్గురువు సహకారముంటేనే మంత్రసిద్ధి, కాయసిద్ధి, దేవతా అను గ్రహంతోబాటు అనవరతము సత్య ధర్మ అహింసలవైపు ప్రయాణించే అదృష్టం కల్గుతుందని తెలియ చేయడమైనది.
- ఈ గ్రంథముద్రణలోగాని, విషయంలోగాని ఏవన్నా లోపాలు ఉంటే తెలియజేయ గలరు.