ఇది చారిత్రక కల్పన. దీనిలో ప్రధానకథ సామాన్యశకం 1296 - 1323 మధ్యలోనిదే అయినా కాకతీయ సామ్రాజ్య స్థాపన నుంచి శ్రీకృష్ణదేవరాయ విజయం వరకు వివిధ సన్నివేశాలను, విభిన్న రాజకీయ, మత పరిస్థితులను చర్చిస్తుంది. ఆంధ్ర రామాయణమని పిలిచే కాటమరాజు కథను, తెలుగు నెలతో అత్యంత సామీప్యమున్న పశుపతాస్త్ర దివ్యగాథను కూడా స్మరిస్తుంది.ఆనాటి ఓరుగల్లు కోట వైభవాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపిస్తుంది. పట్టు సడలని కథనం ఆసాంతం చదివిస్తుంది.