Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
Philosphica Poetica లో పరిచయమై, సింగపూర్‌లో అని పలకరించిన Aprilia Zank ఒక విశిష్టమైన వ్యక్తి. ఆమెలానే ఆమెకు మార్మికమై, రూపకాలంకారాల సొబగులతో పాఠకుడిని అంతకుముందు దరి ఈ లోకాల్లోకి తీసుకుపోతుంది. జర్మనీ, ఇంగ్లీషు భాషలలో అద్భుతంగాకవిత్వం " వ్రాస్తుందామె.
సింగపూర్ లో ఆత్మీయంగా మెలానే ఆమె కవిత్వమూఅంచని ఎడ్గార్ అలెన్ పొ, డిలాన్ థామస్, థామస్ గన్ లాంటి కవుల కవిత్వంలా ఆమె కవిత్వంలోనూ సస్పెన్స్, మార్మికత, మెలాంఖలి, గాఢత మిక్కిలిగా ఉండి చదువరుల మనస్సులపై చెరగని ముద్ర వేస్తాయి ఆమె సృష్టించిన పదచిత్రాలు.
టి.ఎస్. ఎలియట్ కవిత్వమంటే ఇష్టపడే ఏప్రిలియా, తన కవిత్వంలో కూడా సందర్భోచితంగా Allusions (పరోక్ష ఉదాహరణలు) వాడి కవిత్వాన్ని రసరమ్య భరితం గావిస్తుంది. మ్యూనిక్ లోని Ludwig Maximilian University లో లెక్చరర్ గా, ఇండియా అంటే ఎంతో ఇష్టపడే వ్యక్తిగా ఆమె నాకు స్నేహితురాలైన సందర్భంలో వెలువడుతున్న ద్విభాషా కవిత్వం ఈ కవితా సంపుటి.
ప్రపంచంలోని ప్రాచీన కవుల నుంచి నేటి ప్రఖ్యాత కవుల వరకూ వారి కవిత్వాన్ని తెలుగు పాఠకులకు పరిచయం చేసే మహాయజ్ఞంలో భాగంగా ఈ కవితా సంపుటిని సృజనలోకం సవినయంగా తెలుగు సాహితీలోకానికి అందిస్తున్నది.
- డాక్టర్ లంకా శివరామప్రసాద్