ఆధునిక ప్రపంచములో అన్ని విధములైన జీవన విధానము లందు కూడా "పోటీ" అనే అంశము ప్రధానముగా కనిపిస్తోంది. ముఖ్యముగా ఉద్యోగములు ఎన్నికలోను, అధికారమును పొందే అంశములైన రాజ్యంగ పదవులను పొందుటలోను, క్రీడారంగములోను, వ్యాపారములలోను ఎందులో చూచీనా, ఏ విధముగా పరిశీలించినా ఈ పోటీ అనే అంశమునకు చాల ప్రాధాన్యత గలదిగా చెప్పవచ్చును.
పూర్వకాలములో మహారాజుల తమ వినోదము కొరకు, ఉత్తమ వ్యక్తులకు తమ కొలువులోకి తీసుకొనుటకు, ప్రతిభ వంతులను సత్కరించించుట కొరకు పోటీలను నిర్వహించుట కలదు. పై అంశములాధారంగా పోటీ అంశమును గూర్చి పాఠక లోకమునకు తెలియ చేయవలయుననే సంకల్పముతో చిన్న ప్రయత్నముగా ఈ రచన చేయబడినది.
-యస్.ఆర్.నూతి.