కే.పి. అనే నక్షత్ర జోతిష్యం మరియు భావస్ఫుట అను సంధాన సిద్ధాంతములు మేధావుల సుదీర్ఘ పరిశోధనల ద్వారా ఏర్పరచబడి , భారతీయ జ్యోతిషశాస్త్రము యొక్క పరిపూర్ణ తను సూచిస్తూ నిర్దుష్ట ఫలితములను నిర్ణయించి భవిష్యత్తు చెప్పుటలో ప్రాచుర్యము పొందినవి. వాని సూత్రములను అన్వయిస్తూ ఫలితములను చెపుటను సోడాహరణ పూర్వకముగా పాఠకులకు అందజేసి వివిధ అంశము లకు సంబందించిన వివరణలు చూపించుట జరిగినది. ఇది మూల గ్రంధము కాదు. కానీ మౌలిక సూత్రముల అన్వయమును తర్కబద్ధము గాను విశ్లేషణ పూర్వకము గాను సోదాహరణగా చూపి చదువరులకు గల ఆశక్తికి సహేతుకమైన పద్దతిలో తగువిధమైన సహకారము అందచేయుటయే నా ప్రధాన ఆశయము.
-యన్.సుబ్బారావు.