Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
ఆ ఐదు అంగాలు : 1. తిధి, 2. వారం, 3. నక్షత్రం , 4. యోగం, 5. కరణం
ఈ ఐదు అంగాలను బట్టి తెలుగు సంవత్సరాది అయిన ఉగాది నుండి ఒక ఏడాదికి కాలమాన పట్టికను తయారు చేసి వివిధ రాశుల వారి జాతక చక్రాలను బట్టి వారికి రాబోయే రోజులు ఎలా ఉండబోతున్నాయో వంచాంగంలో పేర్కొనబడుతుంది. L.తిధి
తిధి అంటే : వేద సమయ గణితము ప్రకారము చంద్రమానములో ఒక రోజును తిధి అంటారు. ప్రతి చాంద్రమాసముఓ 30 తిధులు ఉంటాయి. సూర్యుడు నుండి చంద్రుని కలదలికలు తిధులవుతాయి. ఉదాహరణకు సూర్యుడు చంద్రుడు కలిసి ఉంటే అమావాస్య, అదే సూర్యచంద్రులు ఒకరికి ఒకరు సమాన దూరములో వుంటే పౌర్ణమి అవుతుంది. కాస్త్రీయముగా సూర్యుడు, చంద్రున్ని కలుపుతూ ఉన్న అక్షాంశ కొణు 12 డిగ్రీలు పెరగడానికి పట్టే కాలాన్ని తిధి అనవచ్చు. తిధులు సూర్యోదయమున ప్రారంభము కావు సూర్యాస్తమయానికి ముగియవు. రోజులోని ఏ వేళలో అయినా మొదలయ్యి, అంతమయ్యే అవకాశము ఉంది. ఒక్కొక్క తిధి దాదాపు 19 నుండి 26 గంటల సమయము ఉంటుంది.