Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
“ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై” అన్నట్లుగా మాస్టర్ ఇ.కె అను సూర్యుడు తన శిష్యులందరికీ ఎటువంటి విభేధమలు లేకుండా జ్యోతిష, సాముద్రిక శాస్త్రములను అందించినారు. ఆ అమృతమును ఎంత ఆస్వాదించినవారికి అంత అందినట్లుగా చాలామంది జ్యోతిషమనే అమృతమును గ్రోలిరి. అటువంటి వారిలో నేనొకడను. మాస్టర్ ఇ.కె. గారు అందించిన సాయన పద్ధతిని యిప్పుడు మీ ముందు వుంచుతున్నాను. ఆయన అనంతరం గురుదేవులు శ్రీ వేదాంతం ఆనందాచార్యులవారు ఈ విద్యను అందించి మమ్ములను తరింపచేసిరి. వారిద్దరికీ నా సాష్టాంగ ప్రణామములు నన్ను అభిమానించి, ఆదరించి ప్రతి విషయములోనూ సహకరిస్తూ ముందుకు నడిపిసున్నా శ్రీ ఎమ్.వర్.యల్. రావు గారికి వారి సతీమణి శ్రీమతి వనజ గారికి ప్రత్యేకమైన నమస్కారములు.
సహాయసహకారములు అందించుచూ, నన్ను ముందుకు నడిపించుచున్న శ్రీమాన్ .. ఎక్కిరాల అనంతకృష్ణ (నా పెద్దన్నయ్య)కు నమస్కారములు. ముఖ్యముగా , నాచిన్నతనమునుండి జీవిత సత్యములు తెలుపుచూ ముందుకు నడిపించుచూ, ఈ విద్యలనభ్యసించుటకు తోడ్పడుచున్న శ్రీమాన్ ఇ.వి.యమ్. ఆచార్య (నాచిన్నన్నయ్య) BC పాదపద్మములకు ప్రత్యేక నమస్కారములు.
జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, భారతమాతకు నమస్కారములు.
ఎక్కిరాల శ్రీనివాసాచార్య