Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
ఎవరీ కృష్ణమూర్తి?
మన మధ్యే మదనపల్లిలో పుట్టాడు. మద్రాసులో పెరిగాడు. ఇంగ్లాండ్‍లో చదివాడు. అమెరికాలో ‘ఆర్యవిహార్’
స్థాపించాడు. తత్త్వదర్శిగా, ప్రపంచ బోధకుడుగా ప్రసిద్ధి చెందాడు.
ఏమంటాడు?
‘‘సత్యం పంథా లేని ప్రదేశం. ఏ మార్గం ద్వారాగాని, ఏ శాఖ ద్వారా గానీ దాన్ని పొందలేరు. అది హద్దులకు, నిబద్ధతకు
లోనుకానిది… జ్ఞాపకాలతో నిండిన మనస్సు దాన్ని కనుగొనలేదు… దైవం గాని, సత్యం గాని, యథార్థం గాని, ఏ పేరు
పెట్టినా- ఉన్నదా లేదా అనే దానికి సమాధానం నీవు తప్ప ఎవ్వరూ చెప్పలేరు’’.
ఏం చేశాడు?
జీవించడంలో ధ్యానమున్నదా, లేక ధ్యానించడంలో జీవితమున్నదా అనేది స్పష్టంగా చూశాడు.
మీరేమంటారు?
‘‘ఇతనిలో సోక్రటీస్ ఆలోచనల నిడివి, బుద్ధిని శోభాయమానం చేసే ప్రబోధం ఉన్నాయి. ఇతడు సర్వోకళావతంసుడు’’ - ప్రొ. జి. వెంకటాచలం
‘‘అతని మాటల్లో సౌందర్యం, ఆనందం, యథార్థం ఇమిడి ఉన్నాయి’’ -జెఫర్స్
‘‘అతడత్యంత పవిత్రమైన సౌందర్యవంతమైన వికసిత మానవతా కుసుమం’’ – అనిబిసెంట్