Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
2017 అక్టోబరు నెలలో రామోజీ ఫిల్మ్ సిటీలో నేను నిర్వహించిన ప్రపంచ కవుల సమావేశం - Pentasi-B India Poetry Festival లో నాకు ఘనా పార్లమెంటు సభ్యుడు, మాజీమంత్రి, కవి, దార్శనికుడు అయిన 'రషీద్ పెల్పువొ'తో పరిచయం ఏర్పడి స్నేహంగా మారింది. ఈ పుస్తకంలోని కవితలు రషీద్ లోని దేశభక్తి, మానవత్వం, ప్రేమలను అద్భుతంగా ప్రకటించి చదువరులను ముగ్గులను చేస్తాయి.
భారతదేశపు పరిస్థితులను దాదాపుగా ప్రతిబింబించే ఆఫ్రికా దేశాల ఆర్ధిక, సామాజిక, రాజకీయాలు, ప్రజా సమస్యలు, మనోభావాలు ఈ కవితలలో ఎంతో హృద్యంగా కానవస్తాయి. ఒక్క కులవ్యవస్థ మినహా మిగతావన్నీ ఒకే మూసలో పోసినట్లు ఉండడం మనల్ని ఆశ్చర్యచకితులను చేస్తుంది.
ఒక కవి, యోధుడు రాజకీయ నాయకుడైతే అతడి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో, రాజకీయాల విషయాలు అతడి అంతరాత్మపై ఎలాంటి అలజడిని రేపుతాయో మనం ఈ కవితలలో చక్కగా గమనించవచ్చు.
'ఘనా'లో 2018 సెప్టెంబరు 28వ తేదీన విడుదల కానున్న ఈ ద్విభాషా కవిత్వం అందరి మన్ననలను పొందుతుందని ఆశిస్తూ...
- డాక్టర్ లంకా శివరామప్రసాద్