Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹100

నవలా విన్యాసం

నవల అనే రచనాప్రక్రియ నావెల్ (Novel) అనే అంగపదానికి ఆంధ్రానుకరణం. అదే తెలుగు నైఘంటికార్థం అయితే 'స్త్రీ' అని అందుకేనేమో ఆ మధ్య రచయిత్రులే నవలారచన ఎక్కువ చేసి ప్రాచుర్యం పొందారు. అలాంటివారిలో శ్రీమతి శ్రీదేవి ఒకరు. ఈమె సమకాలీనుల్లో చాలామంది. రచయితులు రచించడం మానేసినా ఈవిడ ఇంకా రచన కొనసాగిస్తున్నారంటే ఈమెలోని భావశబలత, విషయవివేచనమే కారణం - ఈమె రచనల్లో ముఖ్యంగా నవలల్లో నవలలే స్త్రీలు) ప్రధాన పాత్రలు - వారి బాగోగులే చర్చనీయాంశాలు.

వృత్తిరీత్యా ఆంద్రోపన్యాసకురాలు కావడం, లోకాన్ని నిశితంగా పరిశీలించే స్వభావం ఉండడంవల్ల నవలారచనలో వీరిదొక ప్రత్యేకమైన శైలిగా రూపొందింది. 'వీరికలం నుండి వెలువడిన నవలామణుల్లో మరొకటి 'జీవనవిన్యాసాలు'.

మానవజీవనశైలి వైవిధ్యభరితమైనది. స్త్రీల విషయంలో యిది మరింతగా చెప్పుకోతగ్గది. అందరూ చేసేది సంసారాలే అయితే అందులోనే ఎన్నెన్ని విన్యాసాలో.... 'స్వతహాగా చేసే విన్యాసాలు కొన్ని.... విధిచేయించే విన్యాసాలుకొన్ని..... భర్త చేయించేవి కొన్ని.... అత్తామామల చేతిలో కొన్ని... సమాజంచేతకొన్ని... ఇలా పలురకాలైన విన్యాసాల్లో స్త్రీలకు అనుకూలమైనవి, స్త్రీలపట్ల సమభావన చూపేవి చాలా తక్కువ. ప్రపంచం, సమాజం... ప్రగతి పథంలో పోతున్నాయని చెప్పుకుంటున్న ఈ శతాబ్దంలో కూడా కుటుంబ హింస, వ్యక్తిగత హింస పాలవుతున్న మహిళలు లెక్కకు మిక్కుటంగానే వున్నారు. స్త్రీత్వం సంతరించుకుంటున్న రోజుల్నుంచి, చదువుల్లో, పెళ్లిళ్లలో, సంసారాల్లో, ఉద్యోగాల్లో స్త్రీని చులకనగా చూసే కళ్లు, తమకు అనుకూలంగా మలుచుకోవడానా ప్రయత్నించేవాళ్లు, ముంచెత్తుదామని కాచుకున్న సమాజపు కుళ్లు... ఎన్ని"

తమ సహజసిద్ధమైన అనురాగాన్నీ, ఆప్యాయతను, ప్రేమను, శక్తిని సామర్థ్యాన్ని ప్రదర్శించాలంటే అడుగడుగునా ఆంక్షలే... అపనిందలే... అరాచకా.....................