Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹190

 కుల మతాల గీతలతో తలరాతలనే శాసించే కుళ్ళిన సమాజాన్ని దాటి విశాల కవితా సామాజిక జగత్తుకు ఎదిగిన మేటి కవితా ధీరుడు. విశ్వ నరుడు గుర్రం జాషువా ఆధుని కాంధ్ర కవులలో విలక్షణమైన కవితా శక్తిని సొంతం చేసుకొని సమాజాభ్యుదయానికి అసమానతలపై సమరభేరి మ్రోగించిన కవి ఈయన.

                     1895 సెప్టెంబర్‌, 28న గుంటూరు జిల్లా వినుకొండలో జన్మించి ప్రాథమికోపాధ్యాయులుగా జీవితం ప్రారంభించి, తెలుగు పండితులుగా పనిచేసి, ఆకాశవాణి మద్రాసు కేంద్రంలో ప్రొడ్యూసర్‌గా ఉద్యోగం చేశారు. శాసన మండలి సభ్యులుగా కూడా పనిచేసి అనేక పదవులు నిర్వహించి ఉన్నత స్థాయిలో జీవించినట్లే ఉత్తమ సాహిత్యం సొంతం చేసుకొని ఆధునిక వర్తమాన కవులకు స్ఫూర్తిగా నిలిచాడు. భారత ప్రభుత్వం 'పద్మభూషణ్‌'తో సత్కరించగా, ఆంధ్ర విశ్వ విద్యాలయం 'కళాప్రపూర్ణ'తో సన్మానించింది. కవికోకిల, నవయుగ కలివిచక్రవర్తి, 'కవితా విశారద' మధుర శ్రీనాధ' వంటి బిరుదులతో పాటు కనకాభిషేకం, గండపెండేరం వంటి గౌరవములను పొంది తన ప్రతిభను జగతికి చాటినాడు.

                        పిరదౌసి, గబ్బిలము, ముంతాజ్‌ మహల్‌, స్వప్నకధ, మొదలైన ఖండకావ్యములు, స్వయంవరం, బాపూజీ, నాకథ,జీవితం వంటి కావ్యములు, మీరాబాయి, తెరచాటు, ధృవవిజయం, క్రీస్తు మొ|7 నాటకాలతో పాటు నేతాజి, ముసాఫర్లు, కొత్తలోకం వంటి రచనలు చేసి కేంద్ర సాహిత్యం అకాడమి పురస్కారం పొందిన సాహితీవేత్త ,మానవతావాదం పునాదిగా సృజించబడిన కవిత్వం నేటి యువతకు, కవులకు, మానవతా వాదులందరికి స్ఫూర్తిదాయకమే.

                                                                                                                             - వడ్డేపల్లి మల్లేశం

 

ఇందులో ఏడు భాగాలుగా ఉన్న ఖండకావ్యములు మొత్తము కలవు.