జ్యోతిష శాస్త్రమున ఫలితములు చెప్పుట చాలా కష్టసాధ్యమైన పని. ఇది పూర్వపు రోజుల నుండి ఈ రోజు వరకు కూడా అలా కష్టసాధ్యపు స్థితిలోనే ఉండిపోయినది. దీనిని సులభతరము చేయటం కొఱకు ఎంతో పరిశోధన చేయవలసియున్నది. ఎన్నో క్రొత్త పద్ధతులు, క్రొత్త పంథాలు, వెతుకవలసియున్నది. క్రొత్త దారులు త్రొక్కవలసియున్నది.
అసలు ఫలితాలు తప్పడానికి ముఖ్యమైన కారణాలు ప్రధానంగా కొన్ని ఉన్నాయి.
సరియైన జన్మకాలం లేక పోవటం, లేదా సరియైన జన్మకాలం లేక పోవడంతో జన్మ కాలాన్ని సరిచేసే ప్రయత్నం జ్యోతిష్యులు చేయకపోవడం మరియు జన్మకాలన్ని సరిచేసే సరియైన పద్ధతులు లేక పోవడం మరియు సరియైన పద్ధతులు లేని నేపథ్యంలో సరియైన పరిశోధన జరిగి క్రొత్త పద్ధతులు రావటమో లేక ఉన్న పద్ధతులను సరియైన పద్ధతులుగా మార్చే ప్రయత్నం జరుగక పోవటమో సంభవిస్తోంది.
ఫల భాగాన్ని నేటి కాలానికి తగ్గట్టుగా పరిశోధనలు చేసి మార్చటం.