Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
అక్కడ బ్రాహ్మణులదీ ఆదివాసీల పరిస్థితే
మధ్య ప్రదేశ్ లోని తూర్పు భాగంలో ఉన్న అమరకంటక ప్రకృతి సంపదకు పరిచితమైన ప్రాంతం. నర్మదా నది జన్మస్థానమిది. నర్మద కాకుండా, సోన్, జోహిలా నదులు ఇక్కడే పుట్టాయి. దేశంలోని విశిష్టమైన వనస్పతులకు ఇక్కడి అడవి జన్మనిచ్చి రక్షించుకుంటూ వచ్చింది. మహాభారతంలోని లక్క ఇంటి ప్రసంగం ఇక్కడ జరిగిందనటానికి దాఖలాలు ఉన్నాయి. రామాయణంలోని శబరి శ్రీరామచంద్రునికి రేగు పళ్ళు తినిపించింది ఇక్కడే. ఇది ప్రత్యేకమైన గిరిజనుల ప్రాంతం కూడా. పెద్దసంఖ్యలో గోండు ఆదివాసి జనం ఇక్కడున్నారు. బైగా ఆదివాసులు అధిక సాంద్రతగల ఈ అడవిలో నివసిస్తున్నారు. సహేరియా, అగరియా, పడొకా, కోల్ ఆదివాసి జనుల గ్రామాలు అక్కడక్కడ ఉన్నాయి. అచానకమార (జీవమండలం), బయోస్పేర్ ఇక్కడ ఉంది. ఇది పులుల విడిది
అతి పెద్ద రాష్ట్రమైన మధ్యప్రదేశ్ ను విభజించి ఛత్తీస్ గఢ్ అనే ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అమరకంటక ఎడమవైపున రాష్ట్ర విభజన రేఖ ఉంది. ఉత్తమమైన రోడ్లు ఇప్పుడిప్పుడే ఇక్కడ అడుగు పెట్టాయి. ఉన్నతస్థాయి ప్రాథమిక విద్య ఇక్కడ ఇంకా కలే! గోండు ఆదివాసులు అడవి అంచున నివాసాలు | ఏర్పరుచుకున్నారు. బైగా ఆదివాసీలు అడవి మధ్యలో తమ ప్రత్యేమైన ఇళ్ళను | ఏర్పరుచుకున్నారు. అక్కడక్కడ సహేరియా జనుల వసతి ఉంది. ఇక్కడ వాళ్లు తక్కువ. అగరియా జనం బయలు కమ్మరి ఆదివాసులు. ఎక్కడ అన్నం..........