Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
వివిధ సాహిత్య ఉద్యమాలు తెలుగుదేశాన్ని ఎంతో కొంతకాలంపాటు ప్రభావితం చేసి చివరకు ప్రధాన సాహితం స్రవంతిలో కలసి పోతూ వుంటాయి. ఈ ఉద్యమాలతో సంబంధం లేకనో వాటితో విభేదించకుండానో కేవలం జీవితాన్ని మాత్రమే పట్టుకుని ప్రయాణించే సాహిత్యం ఎప్పుడూ వుంటుంది. పతంజలి శాస్త్రిగారిది అలాంటి సాహిత్యం . చేదైన జీవితమూ, తేనైన హృదయమూ ఆయన సాహిత్యంలో ప్రధాన లక్షణంగా వుంటాయి. ఇందులోని ప్రతి కథ మూలాల్లోనూ అదే కనిపిస్తుంది. -
రచయిత, సమాజమూ, రచనా కలిసి ఒక త్రిభుజాకార కటకం అవుతుంది. అప్పుడందులోంచి అసలు రంగులు ఏడూ కంటికి కనిపిస్తాయి.
ఆయన నా వలె బండవాడు కాదు, నా కంటే పెద్ద పతంజలికి మొహమాటం, వినయం, ఓర్పు, సహనం చాలా ఎక్కువ. నాలోని దుర్లక్షణాలు అంతగా లేక, నాలోని లేశమాత్రపు మంచి లక్షణాలు పుష్కలంగా వున్నందువల్ల కూడా ఆయన పెద్ద పతంజలి. పెద్దవారికి చిన్నవారు నమస్కరించాలి కాబట్టి ఆ పని చేస్తున్నాను.
చిన్న పతంజలి కె.ఎన్.వై. పతంజలి