Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹300

              ప్రస్తావన ఆంగ్ల కవుల కవిత్వాన్ని అనువదించే కార్యక్రమంలో తొలి ప్రయత్నంగా 18 మంది సుప్రసిద్ధ కవులను ఎన్నిక చేయడం క్రిస్ వుడ్ హెడ్ (Chris Wood Head) ఇంతకు ముందే చేసిన పనికి - ఇద్దరు కవులను అదనంగా చేర్చడమే నేను చేసింది. ఆంగ్ల సాహిత్యంలో ఈ కవులు సృష్టించిన అద్భుతాలను మరల మరల పఠించి, తిలకించి, ఆస్వాదించి మంత్రముగ్ధులమై పోవడానికి ఈ అనువాదం తోడ్పడుంది.

             అజరామరమైన ఈ కవిత్వ జలపాతాల్ని తిలకించడానికి బాహ్య అంతర్జృష్టులు రెండూ కావాలి. వైయక్తికమై, మార్మికమై, సున్నితంగా, తీవ్రంగా - హృదయం, మనసు లోలోపలి పొరల్లోకి చొచ్చుకుపోయి, అక్కడే తిష్ఠవేసి మనల్ని వెంటాడి, వేటాడే ఈ అపురూప అక్షర జలధుల్ని అత్యంత మధురమైన తెనుగు భాషలోకి 'నొప్పింపక తానొవ్వక' సరళిలో స్వేచ్ఛానువాదం చేసే అవకాశం, అదృష్టం నాకు లభించాయి.

               గ్రీకు, లాటిన్, జర్మనీ, రష్యన్, తమిళ, ఆంగ్ల ప్రసిద్ధ కావ్యాలను కవితలను, తెలుగు భాషలోకి అనువదించి సాహిత్యలోకానికి అందించిన సృజనలోకపు మరో వినయపూర్వక కానుక- జలపాతం-అష్టాదశ ఆంగ్ల కవుల కవిత్వం తొలి భాగం. ఎప్పటిలానే తెలుగు పాఠకులు ఈ పుస్తకాన్ని విశేషంగా ఆదరిస్తారని ఆశిస్తూ....

                                                                                                                                                                                                                                                  - డాక్టర్ లంకా శివరామప్రసాద్