ఆకాశంలో సూర్యుడు నిప్పుల పళ్ళెంలా తన ప్రతాపం చూప్పిస్తున్నాడు. గాలిని ఎవరో కొలిమిలో కాచి సాగదీసి పంపిస్తున్నట్టు వేడిగా వీస్తోంది. నీడను వెదుక్కోడానికి ఎటూ వెళ్ళలేని కొండలు గింజుకుంటున్నట్టు కనిపిస్తున్నాయి.
దశరధరామయ్య ఇక అడుగు వేయలేకపోయాడు. చుట్టూ చూసాడు. గొడ్డు పక్కన ఎదో పేరు తెలీని ముళ్ళు చెట్టు ఒంటరిగా తనలో తానే ముడుచుకు పోయినట్లు కాస్తoత నీడను ప్రసరిస్తోంది.
అయన అటువేపుకి నడిచాడు, అంతవరకూ తండ్రి చిటికిన వేలు పట్టుకుని నడుస్తున్న అయన కూడా కదిలాడు. ఆయనకి నలభై అయిదేళ్ళయినా చూడటానికి అరవై ఎల్లవాడిలా వున్నాడు, ఆయన భుజం మీదున్న ముతక తువ్వాలు ఆగర్భ దారిద్ర్యాన్నితెలియజేస్తుంది.తరువాత ఏం జరిగిందో ఈ నవల చదివి తెలుసుకొనగలరు.
-మేర్లపాక మురళి.