సత్సంకల్పాను సాదింపచేసుకొనే సఫలకృత జన్మనిచ్చిన న తల్లితండ్రులు శ్రీమతి కాశీన అన్నపూర్ణ, శ్రీ విశ్వనాధం గార్లకు నమస్సుమాంజలి. నన్ను అదశ్యత్మికoగా తీర్చిదిద్దిన న గురుదేవులు శ్రీమాన్ ఆరవెల్లి నరసింహాచార్యులు వారికీ పాదాభివందనాలు.
పురాణ ప్రసిద్ధము, ప్రాచీన శిల్పకళారంజితములైన దేవాలయాలకు బహుళజన ప్రచారమై నాధ్యాయము. భారతదేశంలో 600 పుణ్యక్షత్రాలను దర్శించిన భాగ్యముతో నేను ఏ విధమైన ఫలాపేక్ష లేకుండా ఏర్చికూర్చి ఇచ్చిన30 ఆధ్యాత్మిక గ్రంధాలను ముద్రించి, వానిని రాష్ట్రవాప్తంగా వెలుగులోకి తీసుకొని వచ్చిన శ్రీ గొల్లపూడి వీరాస్వామి సన్, రాజముండ్రి వారికి, శ్రీగుమ్మ .నగేష్ గారికి కృతజ్ఞతాభివందనాలు.
నా స్వగ్రామం శ్రీ కాకుళం పట్టణంలో యున్న ఫజుల్ బేగ్ పేట. నాగావళి నదీతీరాన గల ఈ గ్రామంలో వెలసియున్న చల్లని గ్రామదేవత "శ్రీ భద్రమహాంకాళీ" దయ వలన గ్రామం సుభిక్షంగా యుండి, ఇచ్చట జన్మించినవారు చాల మంది ఉన్నత స్థితిలోయున్నారు. అందులోనే ఒకడిగా యున్న నాకు అమ్మవారు కల్పించిన ప్రేరణతో ఆమె పై ఒక చిన్న గ్రంధం వ్రాయలనే సంకల్పం కలిగింది. ఆ దేవత అనుగ్రహంతో చాలా వేగంగా పూర్తి చేయగలిగాను.
-కాశీన వెంకటేశ్వరరావు.