మాల ధరించినంతకాలుము "గోవింద" అన్న సంబోధనతోనేఎవ్వరినైనా పిలవాలి.ప్రతిరోజు 108 మార్లు "గోవింద" నామం స్మరించాలి.
ప్రతి రోజు ఉదయం మరియు సాయంత్రం తల స్నానం చేయాలి. చల్లని నీటితో అనగా బావిదగ్గరగాని, నది దగ్గరగాని, చెరువు దగ్గరగాని సదుపాయం లేనివారు ముందు రోజు పట్టిన నీటితో చేయాలి. తల దువ్వరాదు. అద్దంలో ముఖం చూడరాదు. చెప్పులు ధరించరాదు. పసుపు రంగులో వున్న దుస్తులు ధరించవలెను. ప్రతిరోజు నుదుటన తిరునామం ధరించాలి. ధూమపానం, మద్యపానం, మాంసాహారం, దరి చేరరాదు. శాకాహారం మాత్రము స్వీకరించాలి. ప్రతిరోజు 108సార్లు లేక 21మార్లు స్వామికి ప్రదక్షిణములు చేస్తే మంచిది. • రోజుకొకసారి మాత్రమే భోజనం చేయాలి. రాత్రికి ఖచ్చితముగా ఫలాహారం మాత్రమే స్వీకరించాలి. నెలమిద నిద్రించాలి. స్త్రీ సాంగత్యం అసలు పనికి రాదు. బ్రహ్మచర్యం పాటించాలి. వీలయినంతవరకు శనివారం వేంకటేశ్వరస్వామి దేవాలయములు దర్శించాలి.కనీసం ప్రతిరోజు వేంకటేశ్వరస్వామి అష్టోత్తర శతనామ స్తోత్రమునుచేయాలి. ఉదయం సాయంత్రం శరణుఘోష చెప్పుకోవాలి. ప్రతి ఉదయంసాయంత్రం పూజచేసి హారతి తీసుకొనవలెను .స్నో,సెంట్ వాడరాదు. తప్పుడు మాటలు, అబద్దాలు, అశ్లీలమైన పదాలు మాట్లాడరాదు.