Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
ఇంతకీ ఈ 'జలజాక్షి' ఎవరూ? ఆవిడ ఆగడాలు ఏంటీ? అని అడుగుతున్నారు కదూ? అక్కడకే వస్తున్నాను. ఈ 'జలజాక్షి' మన పక్కింట్లోనో, ఎదురింట్లోనో, వెనకింట్లోనో లేదా....
మన బంధువులలోనో ఖచ్చితంగా ఉండే ఉంటుంది. మీరు జాగ్రత్తగా గమనించాలే కానీ ఆవిడ మనతో ఒక జిగురాక్షి లాగానో, జలగాక్షి లాగానో అతుక్కుపోతుంది. అలాంటి ఆవిడకి ఓ పతిదేవుడు ఉంటాడు. ఆయనకి వేరే పేరెందుకని 'జలజాపతి • పేరుతో స్థిరపడిపోయాడు. జలజాక్షి అనే పాత్రతో చెప్పబడిన కథలే ఈ 'జగడాల జలజాక్షి'.
రకరకాల అంశాలపై ఈ జలజాక్షిచే/పై/గురించి చెప్పబడిన కథలే ఉన్నాయి ఈ పుస్తకంలో. అవి ఆవిడ ఇచ్చిన ఉచిత సలహాలు కావొచ్చు, పిసినారి గుణాలు కావొచ్చు, పట్టుకుంటే వదలని జిడ్డు కావొచ్చు, కరోనా రోజుల్లో కష్టాలు కావచ్చు, జలజాపతి భార్యాబాధిత గోడు కావొచ్చు... ఇలా రకరకాలుగా జలజం పాత్రతో హాస్యం పండించే ముఫ్పై ఐదు కథలు ఇందులో ఉన్నాయి. చదవండి. చదివించండి. నవ్వండి. నవ్వించండి.