నాకు జీవితమంటే ప్రేమ. నేను మనిషిని.నాకు కొని ఇష్టాఇష్టాలుంటాయి. పాడాలని, పరుగెత్తాలని ఉంటుంది. నవ్వాలని, నవ్వించాలని ఉంటుంది. నాకు ఇష్టమైనవవేవో కష్టమైనవేవో నేనే నిర్ణయించుకోవాలని ఉంటుంది. పొద్దున్నే పేపర్ తెరగేయాలని ఉంటుంది. సాయంత్రం టి కొట్టు సెంటర్ లో అరుగు మీద కూర్చుని టీ తాగుతూ రాజకీయాల పై విశ్లేషణ చేయాలనీ ఉంటుంది. రాత్రి పూట వెన్నెల వెలుగులో సైకిలెక్కి మనపూరి విధులన్నీ చక్కర్లు కొట్టి రావాలనిపిస్తుంది. నలుగురు కూర్చొని చర్చిస్తున్న చోట నేను ఐదో వ్యక్తినై చర్చలో పాల్గొనాలని ఉంటుంది.
నిజంగా ఇలా చేస్తే ఎవరైనా ఒప్పుకుంటారా? అసలు ఇలాంటి ఆలోచనలను అంగీకరిస్తారా? మానవ మనుగడ సజావుగా సాగడానికి కొన్ని విలువలు, కట్టుబాట్లు ఉండాల్సిందే! కానీ అవి ఒక వర్గానికి అనుకూలంగా, మరో వర్గానికి ప్రతికూలంగా ఉండకూడదు. ఒకరి తప్పులను ఎత్తిచూపడం కాదు. మా ఆవేదనను, అంతస్సంఘర్షనూ నివేదించడమే నా అక్షరాల ఉద్దేశం.
-సునీత గంగవరపు.