Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹130

                     మాండలికాలు ఎప్పుడు చదివినా ఉట్టిదిoచని గడ్డపెరుగులా మధురంగా వుంటయి. పల్లెల్లో ఇంకా మిగిలిన పచ్చటి మాండలికాలు దేవకిగారి కథల్లో శ్రీవారి వక్ష స్థలంలోకి పచ్చలా మురిపిస్తుంటాయి. బాల్యం ఎప్పుడూ అపురూపమే. ఈ కథల్లో ఇసుకలో పురుగులు పరుగులు తీస్తుంటే మనసు పొరల్లో కదిలే గతకాలపు గుర్తులు, గాలిలో పూరెక్కలు ఎగురుతూ వుంటే రెపరెపా అల్లల్లాడే తీరని ఆశలు, ఎండలో నిడలు కదిలిపోతూ వుంటే కనిపించి కనిపించని మరణించిన బంధువుల జాడలు, చెవుల్లో రొదపెడుతూ ఎవరెవరివో మాటలూ వినిపిస్తాయి.

                      ఈ కథలు తామరతూడులు. తేనే తుంపర్లు. తెల్లవారి వెలుగులు. తియ్యటి ముద్దులు . వెచ్చని కన్నీళ్లు. కమ్మని ఆనంద బాష్పాలు. ఇప్పటి నగర దుఃఖాలకు, నిట్టూర్పులకు ఓదార్పు మాత్రలు.నగరం ఒక ఆక్టోపస్ లా విస్తరించి వికృత రూపాన్ని ప్రదర్శిస్తున్న సంక్షుభిత భయద భీకర జీవితంలో ఈ కథల పఠనం ఒక చక్కటి ఉపశమనం.