"ఏమండి రాముడు ఒకటే ఏడుస్తున్నాడండి. డాక్టరుకు చూపించాలి. కడుపులో నొప్పో ఏమిటో ఖర్మ" కన్నీటితో భర్తను లేపింది లక్ష్మి. నిలబడి, నిలబడి, ఒల్లు విప్పి అయిపోగా అలసటా తీర్చుకుంటున్నాడు కండక్టర్ యాదగిరి.
"ఏమిటే ప్రొద్దునే వాగుడు" విసుక్కున్నాడు ముసుగు తియ్యకనే.
"నాదే వాగుదా? నాలుగు రోజులనుండి ఆ సన్యాసికి ఒంట్లో బావుండలేదు." రాగయుక్తంగా ఎడ్వాడానికి ప్రయత్నించింది.
"వాడికి ఒంట్లో బావుండకపోతే నేనేం చేస్తాను. దినమంతా ఇండ్లు చుట్టుబెట్టకపోతే డాక్టర్ దగ్గరకు తీసుకుపోరాదు?"
"నేనే ఇండ్లు చుట్టబెడుతున్నానా? ఇంట్లో రేడియో ఉందా, పత్రికా లున్నాయా? ఎదో తోచినప్పుడు ఆలా వెళ్ళి ఏ పత్రికో అడిగి తెచ్చుకుంటాను. తరువాత ఎం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.