Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹250

శామ్యూల్ హానిమన్

జీవితకథ-పరిచయం "ఏ ఉద్దేశంతో నన్ను ఈ భూమి పైకి రప్పించడం జరిగిందో దానితో వీలైనంతవరకూ నాకున్న మెరుగుపరుచుకునే గుణంతో నన్ను నేను బాగు చేసుకుంటూ, చుట్టుపక్కల వాటినన్నిటినీ కూడా మెరుగుపరిచే సామర్థ్యం ఉందని నాకు తెలియక, నేను మరణించే లోపు నాలో మాత్రమే దాగి ఉన్న అందరికీ మేలు చేసే గుణాన్ని రహస్యంగా ఉంచుతూ, అందరికీ దానిని తెలియ జేయకపోతే,నేను లోక జ్ఞానం లేని వాడినని అనుకోక తప్పదు.

కానీ, ఈ గొప్ప ఆవిష్కరణని నేను ప్రపంచానికి అందజేస్తుంటే, తర్కంతో కూడిన నా బోధనల్ని నా సహాధ్యాయులు ఎంతవరకు సమర్ధవంతంగా అర్ధం చేసుకోగలరోననే నాకున్న సందేహానికి విచారిస్తున్నాను.”

ఈ పై వాక్యాలతో డాక్టర్ శామ్యూల్ హానిమన్ తన గ్రంథం “The Chronic Diseases” ప్రారంభించాడు.

ఆ విధంగా నిర్ణయించుకున్న ఆ మహత్తర కార్యాన్ని సాధించడానికి స్ఫూర్తితో, అలుపెరగకుండా, విమర్శనాత్మక మేధా సంపత్తి తో చేసిన దానిని మనం ఒక 'కళ' అని మాత్రమే ఖచ్చితంగా చెప్పలేము. హానిమన్ కాలంలో మాదిరి, మేధో సంపత్తి కలిగిన ఈ కాలంలో కూడా , హోమియోపతి సృష్టి కర్త తన జీవితాంతం సలిపిన కృషిని , అందరూ తెలుసుకోవడం మన విద్యుక్త ధర్మమని చెప్పక తప్పదు.

హానిమన్ ని ఉద్దేశించి 'షిల్లెర్' అన్నట్లు, " కొన్ని పక్షాల సద్భావనలు, విముఖతల గందరగోళంలో ఆయన వ్యక్తిత్వ చిత్రం చరిత్రలో అటు ఇటు ఊగిసలాడుతుంది”

శామ్యూల్ హానిమన్ చేసిన కృషి ఒక కళ అయినా కాకపోయినా, అది మానవుని హృదయానికి ఆయన్నిదగ్గరగా తీసుకు వస్తుంది అని చెప్పడానికి సందేహం................