Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
పరిచయం
బిజెపి రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో మతోన్మాద ప్రమాదం అనేక రెట్లు పెరిగిపోయింది. మతోన్మాదాన్ని ధృఢతరం చేయడానికి, మన లౌకిక రాజ్యాన్ని హిందూత్వ రాజ్యం'గా మార్చడానికి అది ఒకదాని తర్వాత మరొకటిగా పలు చర్యలు గైకొంటున్నది. పార్లమెంటు ఉభయ సభల్లో తన మెజారిటీతో జమ్ము కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక హెూదా కల్పించే రాజ్యాంగ అధికరణం 370, 35ఎ లను రద్దు చేసింది. కాందిశీకులకు మతం ప్రాతిపదికన పౌరసత్వం కల్పించే పౌరసత్వ సవరణ బిల్లును ఆమోదించింది. అంతకుముందు ముస్లిం మహిళలకు మేలు కన్నా కీడే అధికంగా చేసే ట్రిపుల్ తలాక్ బిల్లును ఆమోదించింది. రాజ్యాంగ యంత్రాంగాన్ని మతతత్వ పూరితం చేయడానికి ఆరెస్సెస్ ఒక పద్ధతి ప్రకారం ప్రయత్నిస్తున్నది. రాజ్యాధికారాన్ని వినియోగించుకొని వివిధ రాజ్యాంగ వ్యవస్థల కీలక స్థానాలలో తన వారిని చొప్పిస్తున్నది. ఆరెస్సెస్, బిజెపికి చెందినవారు రాష్ట్రాల గవర్నర్లగా నియమించబడుతున్నారు. అనేక మార్గాల ద్వారా ఉన్నత న్యాయవ్యవస్థ తనకు అనుకూలంగా పనిచేసేలా చేసుకుంటున్నది. అయోధ్య విషయంలోను, శబరిమల విషయంలోను, ఇటీవల ఇతర సుప్రీం కోర్టు తీర్పులు న్యాయవ్యవస్థ స్వతంత్రత తగ్గిపోయిన అంశాన్ని రుజువు చేస్తున్నాయి. పోలీసు, సైనిక బలగాల ఉన్నత స్థానాలను కూడ అది వదిలిపెట్టడం లేదు. ఉన్నత విద్య, శాస్త్ర పరిశోధన సంస్థలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. వాటిని సంఘ్ పరివార్ ఆలోచనా కేంద్రాలుగా తయారు చేస్తున్నది. ఛాందసవాద, మత సిద్ధాంతాలపై ఆధారపడిన శాస్త్ర వ్యతిరేక అభిప్రాయాలను అధికారికంగా ప్రోత్సహిస్తున్నది..
ప్రత్యర్థులను, ప్రజలను భయభ్రాంతును చేయడానికి, మైనారిటీలకు వ్యతిరేకంగా విద్వేషాన్ని రెచ్చగొట్టడానికి సంఘపరివార్ సంస్థలు ఫాసిస్టు తరహా పద్ధతులను హిందూత్వ మతోన్మాదం.............