Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
హిందీ-ఉర్దూ జాతీయాలు-సామెతలు
భావవ్యక్తీకరణకు సాధనం భాష. ఆది మానవుడు అనేక వేల సంవత్సరాలు భాష లేకుండానే జీవించాడు. సైగలు, అరుపులు, కూతలతోనే జీవితాన్ని వెళ్లదీశాడు. ఆ అరుపులు కూతలే కాల క్రమంలో ఒక్కో భావానికి సంకేతాలయ్యాయి. కాలగమనంలో ఆ సంకేత శబ్దాలే భాషా శబ్దాలుగా స్థిరపడ్డాయి. 'భాష' అంటే ఎదుటి వాడు అర్థం చేసుకొనే ధ్వనులే భాష అని అర్థం. ఆ తొలినాళ్ల శబ్దాలే కాలక్రమంలో భాషగా స్థిరపడ్డాయి. అయితే ఈ భాషా శబ్దాల్ని ప్రపంచమంతటా ఆది మానవుడు ఒకే రీతిగా ఉచ్చరించి యుండలేదు. ఒక్కో
ప్రాంతంలోని మానవుడు ఒక్కో రకమైన శబ్దాన్ని ఉపయోగించడం వల్ల నేడు ప్రపంచంలో ఇన్ని వేల భాషలు మనకు కనిపిస్తున్నాయి. మానవునిలో నాగరికత పెరిగి ఆధునికుడిగా రూపాంతరం చెందిన నేటి యుగంలో కూడా ఇంకా లిపి, సాహిత్యం లేని అనాగరక భాషలున్నాయంటే నమ్మాల్సిందే.
ఆదిమానవుడు భాషను నేర్చుకున్న తరువాత, అనేక వేల సంవత్సరాల తరువాతనే లిపిని కనుగొన్నాడు. లిపి ఆవిర్భావంతో అతని ఆలోచనలన్నీ గ్రంథ రూపాన్ని సంతరించుకున్నాయి. 'ఏ భాషలోనైతే లిఖిత సాహిత్యం ఎక్కువగా ఉంటుందో ఆ భాష అంత గొప్పగా వ్యాప్తి చెందుతుందని పండితుల అభిప్రాయం.
కొన్ని వేల సంవత్సరాలుగా ప్రజలనోళ్లలో నానుతున్న భాషలో అనేక చిత్ర విచిత్రాలు చోటు చేసుకున్నాయి. పాత పదాలు వాడుక నుండి కనుమరుగై పోతూంటే కొత్త కొత్త పదాలు వచ్చి చేరుతూ ఉంటాయి. భాష దిన దినం సుసంపన్నమవుతూంటుంది. ఒక సెలయేరులా ఆదిలో ప్రారంభమైన భాష కాలక్రమంలో ఓ మహానదిలా....