Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹300

డా|| అక్కిరాజు రమాపతిరావు

జననం : 1936 జన్మస్థలం : వేమవరం, గుంటూరు జిల్లా, పల్నాడు తాలూకా

గత అరవై సంవత్సరాలుగా ఆధునిక తెలుగు సాహిత్యంలో తనదైన వ్యక్తిత్వం రచనా బాహుళ్యంవల్లనే కాక, వస్తు, ప్రక్రియా, వైవిధ్య, వైలక్షణ్యం చూపుకుంటూ ఇప్పటికి వివిధ సాహిత్య ప్రక్రియాపరంగా 140 గ్రంథాలు, వివిధ తెలుగు దైనిక, వార, మాసపత్రికలలో నాలుగువేల రచనలు వెలువరించారు. 1964లో కందుకూరి వీరేశలింగం సామాజిక, సాహిత్య వికాస యుగ కర్తృకత్వాన్ని పిహెచ్.డి. రూపంగా ఆవిష్కరించారు. వీరేశలింగం పంతులు డైరీలు, లేఖలు సంపాదించి పుస్తకరూపంగా ప్రకటించారు. ఆయన సమగ్ర రచనా సంపుటాలనుంచి ఏర్చికూర్చిన సంకలిత రచనలు 10 సంపుటాలు వ్యాఖ్యావివరణ సహితంగా వెలువడ్డాయి. హైదరాబాదు ఆకాశవాణి కేంద్రం ద్వారా మాత్రమేకాక రెండు నవలలు మద్రాసు (చెన్నై) ఆకాశవాణి కేంద్రం ద్వారా కూడా వీరివి ప్రసారమైనవి.

కొలకత్తా భారతీయ భాషాపరిషత్తు వీరిని సమగ్రరచనా పురస్కారంతో సత్కరించింది. (2011). వీరి సంతానం అమెరికాలో ఉద్యోగాలలో ఉండటంవల్ల 10 సం||లు అమెరికాలో వీరు శ్రీమతి సహితంగా అక్కడి సాంస్కృతిక, సామాజిక జీవన విధానాలను పరిశీలించే అవకాశం వీరికి లభించింది. 

అమెరికాలోని వివిధ తెలుగు సంస్థలు వీరిని గౌరవించాయి. వీరు శ్రీ వేంకటేశ్వర, శ్రీకృష్ణదేవరాయ, కాకతీయ, మద్రాసు (చెన్నై), హైదరాబాదు కేంద్రీయ, ద్రవిడ విశ్వవిద్యాలయ, తెలుగు విశ్వవిద్యాలయ తెలుగు భాషా సదస్సులలో పాల్గొన్నారు. కాకతీయ విశ్వవిద్యాలయం వారు వీరి రచనలపై పరిశోధనలకు గాను ఎం.ఫిల్., పిహెచ్.డి., పట్టాలను ప్రదానం చేశాయి. వీరి సృజనాత్మక రచనలు కొన్ని హిందీ, బెంగాలీ, తమిళ, మలయాళ, కన్నడ భాషలలోకి అనువాదం పొందాయి.

కేంద్రసాహిత్య అకాడమి తెలుగు సమన్వయకర్తగా 2008-2012 మధ్య వీరు పనిచేశారు. సాహిత్య అకాడమి వీరివి 7 గ్రంథాలు ప్రచురించింది. వీరు సద్గురు శ్రీకందుకూరి శివానందమూర్తి మహోదయుల శ్రీరామనవమి పురస్కార గ్రహీతలు. తెలుగునాట ఇంకా సమ్మానాలు, సత్కారాలు వీరికి ఎన్నో లభించాయి.