Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
హార్ట్ ప్రింట్స్
దయగల చూపు
అమెరికన్ కథ
జాన్ అప్ డైక్ ఆ వసంతంలో అకస్మాత్తుగా సుత్తితో కొట్టే చప్పుడు వినిపించసాగింది. ఓ అరడజనుసార్లు సుత్తితో కొట్టాక బండ గొంతు లోంచి వచ్చే బాణీ కాని, శృతి కాని లేని శబ్దం పాటలా వినిపించసాగింది.
బేర లో సౌకర్యంగా ఉన్న, కాంతివంతమైన ఆ గదిలోని కొందరు సైనికులు ఆ శబ్దానికి చెవులు మూసుకున్నారు. అక్కడికి వచ్చిన ఓ యువకుడు ఓ రాజశాసన పత్రాన్ని వాళ్ళకి చూపించాడు.
"నువ్వేనా? ఆ కూనిరాగం తీసేవాడి దగ్గరకి వెళ్ళు.” దాన్ని చదివిన అధికారి సూచించాడు.
“నువ్వు రాజు గారి సైన్యంలో కొత్తగా చేరావు. నిన్నో ఉద్యోగానికి ఎంపిక చేసారని విన్నాను. డీషియస్ ఎస్కులస్ పేరు ఎప్పుడైనా విన్నావా?” అతను ప్రశ్నించాడు.
“నిపుణుడు అని పిలిచేది అతన్నే అని విన్నాను. అతని గురించేనా మీరు అడిగేది?” ఆ యువకుడు అడిగాడు..........