Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹100

                              కర్నూలు చివరి నవాబు గులాం రసూల్ పోరాట గాథను నవలారూపంలో రాయాలని చాలాకాలంగా అనుకొంటున్నాను. నేటికి కార్యరూపం దాల్చింది. 1857 సిపాయిల తిరుగుబాటు కంటే పూర్వమే, కర్నూలు జిల్లాలో మూడు ముఖ్యమైన తిరుగుబాట్లు 

జరిగాయి.

                                భూమి శిస్తుకు వ్యతిరేకంగా తెర్నెకల్లు గ్రామస్థులు జరిపిన తిరుగుబాటు (క్రీ.శ.1801) క్రీ.శ. 1839లో గులాం రసూల్ ఖాన్ జరిపిన తిరుగుబాటు. క్రీ.శ. 1846లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జరిపిన తిరుగుబాటు. మొదట 'పాలెగాడు' పేర నరసింహారెడ్డి తిరుగుబాటును నవలగా రాశాను. (1989) తెర్నెకల్లు గ్రామస్తుల తిరుగుబాటును “తెరిశాకంటి ముట్టడి” నవలగా (2008) రాశాను. చివరగా గులాం రసూల్ ఖాన్ తిరుగుబాటు (2010)లో 'గులాం రసూల్ ఖాన్' పేర నవలగా రాశాను. ఈ మూడు తిరుగుబాట్లు జిల్లాకు ఎంతో గర్వకారణమైనవి.

                                గులాం రసూల్ ఖాన్ నవలకు ప్రేరణ కర్త మాజీ యం.యల్.ఏ. కీ.శే. కర్రా సుబ్బారెడ్డిగారయితే, ప్రోత్సాహ పరిచింది వైద్యం వెంకటేశ్వరాచార్యులు గారు. ఈ నవల రాయటంలో ఎంతగానో సహకరించిన మూసా మియ్య గారికి (రిటైర్డ్ హిస్టరీ లెక్చరర్), వైద్యం వెంకటేశాచార్యులు గారికి, డా. మద్దయ్యగారికి, సోదరులు, చరిత్రకారులు సయ్యద్ నశీర్ అహమ్మద్ గారికి (వినుకొండ, గుంటూరు జిల్లా), అలఘ్ ఖాన్ చిత్ర పటాన్ని మరియు అలఫ్ ఖాన్ గారు వాడిన కత్తి తాలుకూ చిత్ర పటాన్ని ఇచ్చిన గౌ|| అనిస్ ఉల్ ముల్క్ గారికి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను. ఇది నా ఒక్కడి కృషి కాదు. సమిష్టి కృషి. ఆ సమిష్టి కృషే ఈ నవల. ఈ పోరాటాలను నవలలుగా రాసి , ఈజిల్లా వాసిగా, నావంతు బాధ్యతను కొంతమేర అయినా తీర్చుకొన్నానని భావిస్తున్నాను.

                                                                                                                               యస్.డి.వి.అజీజ్