మధ్యాహ్నం మూడుగంటలు దాటుతుంది. ఆకాశం దాదాపు నిర్మలంగానే వున్నా అక్కడక్కడ దూదిపింజల్లాంటి తెల్లని మబ్బులు, వాటి ననుసరిస్తున్నట్టు ముద్దలు ముద్దలుగా వున్నా కొన్ని నల్లమబ్బులు ఆకాశంలో వేగంగా పరుగులు తీస్తున్నాయి.
అదే ఇండియాలో అయినా, భావుకత వున్న వాళ్ళు చూసినా-
"అబ్బా! ఆ తెల్లని మబ్బులు గోపికళ్లనూ, నల్లమబ్బులు కృష్ణ రూపాల్లోనూ వుండి చూడముచ్చటగా వుంది సుమా" అనుకుని మురిసిపోతారు.
కానీ అది అమెరికా.
అలా అని అక్కడ భావుకతకి చోటు లేదని గానీ, ప్రకృతిని ఆరాధించే వాళ్ళు లేరని గని కాదు.
అదే ఆకాశాన్ని ఓ మంచి సౌందర్యధకుడో లేక మంచి కావో చుస్తే-
"వాటే బ్యూటిఫుల్సిన్! ఇటీజ్! తెల్లని టీనేజ్ గళ్స్ వెనక, అల్లరిగా పరుగులు తీసే నల్లకుర్రాళ్లలా లేదూ!" అనుకోవచ్చు ఇంగ్లీషులోనే.
-రావినూతల సువర్నాకన్నన్.