Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹500

                     వరంగల్లులో జనధర్మ వార పత్రిక, వరంగల్ వాణి దినపత్రికల వ్యవస్థాపక సంపాదకులు, అనేక దశాబ్దాలపాటు ఆంధ్రపత్రిక దినపత్రిక విలేఖరిగా పనిచేసిన స్వాతంత్ర్య సమర యోధుడు కీర్తిశేషులు ఎం ఎస్ ఆచార్య, శ్రీమతి రంగనాయకమ్మ దంపతులకు మాడభూషి శ్రీధర్ 1956లో జన్మించారు. మాసూంఅలీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదోతరగతి దాకా చదువుకున్నారు. ఆంధ్ర విద్యాభివర్ధనీ (ఎవివి) జూనియర్ కళాశాల, చందాకాంతయ్య స్మారక (సికెఎం) కళాశాల, లా కళాశాల వరంగల్ లో న్యాయశాస్త్రంలో పట్టభద్ర స్థాయి వరకు విద్యాభ్యాసం. ఎల్ ఎం, ఎం సి జె (జర్నలిజం) ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సాధించారు. లా లో ఒక బంగారు పతకం, జర్నలిజంలో నాలుగు బంగారు పతకాలు గెలుచుకున్నారు. మాధ్యమిక న్యాయశాస్త్రాలలో పరిశోధన చేసి 1994లో ఉస్మానియా లా కళాశాల నుంచి పిహెచ్ డి సంపాదించారు. 1993 దాకా జర్నలిస్టుగా పనిచేసిన మాడభూషి 1994లో లా అధ్యాపకుడిగా మారారు. అప్పడినుంచి కాలమిస్టుగా న్యాయాంశాల గురించి కాలమ్ రాస్తున్నారు. 2000 సంవత్సరంలో నల్సార్ జాతీయ న్యాయవిశ్వవిద్యాలయంలో అసోసియేట్ ప్రొఫెసర్ గా చేరి, ప్రొఫెసర్ గా ఎదిగి, రిజిస్ట్రార్ విధులు కొన్నాళ్లు నిర్వహించారు. 2013 దాకా అంటే 20 సంవత్సరాల పాటు అధ్యాపక వృత్తిలో ఉన్న మాడభూషి శ్రీధర్ కేంద్ర సమాచార కమిషనర్ గా డిల్లీలో ప్రమాణ స్వీకారం చేసారు. సమాచార హక్కు చట్టం కింద పౌరుల సమాచార స్వేచ్ఛను నిలబెట్టే గణనీయమైన తీర్పులు ఇచ్చారు .

                         ఆ తరువాత డిల్లీ సమీపంలోని బెన్నెట్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా చేరి ఏడాదిపాటు డీన్ గా పదవీ బాధ్యతలను నిర్వహించారు. ప్రస్తుతం హైదరాబాద్ లోని మహింద్రా యూనివర్సిటీ, న్యాయ కళాశాల డీన్, ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. 2013లో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మాడభూషి శ్రీధర్ ను ఉత్తమ ఉపాధ్యాయునిగా సత్కరించింది. ఈ

                         పత్రికల్లో వందలాది వ్యాసాలు రాసారు. రాస్తున్నారు. రాజ్యాంగం, నేర న్యాయశాస్త్రం చట్టాలను విశ్లేషిస్తూ సామాజిక సమస్యల గురించి తెలుగులో ఇంగ్లీషులో పాఠకులకు తెలియజేస్తున్నారు. ఇప్పటికి 50 పుస్తకాలు, పది చిన్న పుస్తకాలు రచించిన శ్రీధర్ అనేక వీడియో పాఠాలు రికార్డు చేసారు. ప్రస్తుత గోదా గోవింద గీతం (తిరుప్పావై) శ్రీధర్ 50వ రచన. ఈ పుస్తక రచనలో శ్రీధర్ జీవన భాగస్వామి వేదకల్యాణి సహకారం ఎంతో ఉంది.