Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
ప్రపంచ రాజ్యాంగాలని కొల్లగొట్టి భారతదేశానికి అత్యున్నత రాజ్యాంగాన్ని అందించిన అంబేద్కరే నాకు ఆదర్శం. గొప్ప గొప్ప రాజ్యాంగాలలో వున్న మంచిని గ్రహించి భారతావనికి అత్యున్నత రాజ్యాంగాన్ని అందించినట్లుగా నేను కూడా గిరిజన వీరుల గురించి వారి వీరగాధలను సేకరించి వాటికి నా అక్షర నగలను తొడిగి గిరిజన వీరులందరి గురించి ఒక గ్రంథస్థం చేయదలచిన నా చిన్న ప్రయత్నమే ఈ “గిరిజన వారియర్స్”
గిరిజనులు అమాయకులు, ఆత్మగౌరవం కలవారు, గిరిజన వీరులు చేసిన ఈ పోరాటాలు ఆస్తుల కోసమో, అంతస్తులు కోసమో, పేరు కోసమో చేసినవి కావు కేవలం వారి మనుగడ కోసం వారి బ్రతుకుదెరువు కోసం చేసినవి. చరిత్ర మరిచిన గిరిజన వీరులందరిని వెలుగులోకి తేవాలని ప్రయత్నించాను కాని కొందరి గురించి మాత్రమే నాకు సాధ్యపడింది. వీటితో పాటుగా భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారతదేశం గిరిజనులకు కల్పించిన రాజ్యాంగ రక్షణలు గురించి కూడా కొంత మేర ఈ పుస్తకంలో పొందుపరచటం జరిగింది.
కృతజ్ఞతలతో... డా॥ నాగేంద్ర హంసావత్