Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹100

ఈ పుస్తకం ఎందుకంటే !

గాంధీగారిని తలచుకుంటే నా బాల్యం జ్ఞాపకం వస్తుంది. నేటికీ ఆయనపై ప్రేమ వదలదు. గాంధీజీ హత్య మారుమూలనున్న పల్లెటూళ్లను గూడ ఏడిపించింది. అప్పటికి మా అమరావతి పల్లెటూరే. ఊరు మొత్తానికి ఒకటే రేడియో. అది పంచాయితీ ఆఫీసువారిది. ఉదయం 8గం|| వరకు మ్రోగేది. అది వినిపించే వార్తలే ఊరు మొత్తానికి. ఒకరిద్దరికి సొంత రేడియోలున్నా యేమో! మానాన్నగారికి ఉదయాన్నే అక్కడకు వెళ్లి కాగితం మీద ముఖ్య వార్తలు వ్రాసుకొనే అలవాటు. ఆ రాత్రి వార్తలు విన్న వాళ్లందరు గాంధీజీ మరణవార్తను తమకు తెలిసిన వాళ్లందరికి చెప్పారు. వీధి దీపాలుగూడ లేని ఆ రాత్రుళ్లలో వీధుల్లో గుంపులు గుంపులుగా చేరి మాట్లాడుకున్నారు. మర్నాడు ఉదయాన 9 గంటలకల్లా కన్నీళ్లతో కృష్ణాస్నానానికి వచ్చారు. మహాపురుషుల మరణవార్త వింటే అందరూ స్నానాలు చేస్తారు - ఆత్మ బంధువులాగ భావించి.

ఆ పూట ఎవరూ అన్నాలు వొండుకు తినలేదు. పిల్లలకు మాత్రం వొండి పెట్టారు. పెద్దవాళ్లంతా ఉపవాసమే. సాయంత్రం చీకటి పడ్డ తర్వాత గాంధీజీ దేహానికి అంతిమ సంస్కారాలయ్యాక మళ్లీ స్నానాలు - అపుడు వొండుకుతిన్నారు ఇళ్లల్లో. నాకు అపుడు ఏడు సంవత్సరాలు. ఏమి తెలియకపోయినా తోటి పిల్లలుగూడ ఎందుకో దుఃఖంగా ఉన్నారు. తమయింటి పెద్ద మరణించినట్లే ప్రతికుటుంబం బాధపడ్డది. ఎవరేమన్నా అననీ ఆయన జాతిపితే! ఎంతో చేసినా, పోయిన తండ్రిని మాత్రం ఎంత కాలం గుర్తుంచుకుంటాం!

గాంధీజీని అంతే.

మహాత్మా! జాతిపిత! అన్న పరమగౌరవం ఒకవైపు, తుపాకితో కాల్చి చంపాలన్నంత అసహనం మరొకవైపు, ఒకేవ్యక్తిపై ఉన్నాయంటేనూ, చంపి 70 ఏళ్లయినా ఇప్పటికీ తీవ్రతలు కొందరిలోనయినా కొనసాగుతున్నాయంటేనూ నిశ్చయంగా ఆయన మహా C. తీవ్రంగా వ్యతిరేకించేవారికన్నా అమితంగా గౌరవించే ప్రపంచ మేధావులే ఎక్కువగా