Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
డాక్టర్ జర్సయిల్ యస్. ఆనంద్ వేదాంతి, స్వాప్నికుడు, కవి, విమర్శకుడు. 'Biotext' అనే సిద్ధాంతంతో కవిత్వంలో ఒక ప్రతిపాదించినవాడు. దాదాపు 55 పుస్తకాలు వ్రాసి దేశవిదేశాలలో ఖ్యాతి నార్జించినవాడు. గిబ్రాన్, మిల్టన్, ఛాసర్, ఎలియాట్ లాంటి ప్రసిద్ధ కవుల రచనలకు కొనసాగింపు రచనలను ప్రస్తుత పరిస్థితులకనుగుణంగా వ్రాసి పేరు పొందినాడు.
Fighting the Flames అనేది జర్నయిల్ సింగ్ ఆనంద్ వ్రాసిన తాజా పుస్తకం. సమాజంలో ప్రతి నిత్యమూ జరిగే సంఘటనలకు వేదాంత, తార్కిక దృష్టిలో విశ్లేషిస్తూ కవిత్వం వ్రాస్తాడీ కవి. భాష సులభంగా, సరళంగా, వేగంగాప్రవహిస్తుంది.
Face Book మాధ్యమంలో పరిచయం, అనేక కవిత్వ సమావేశాలలో కలిసి ప్రసంగించిన సందర్భాలు మా ఇద్దరి మధ్య స్నేహాన్ని సుస్థిరం చేసాయి. “జ్వాలలపై పోరాటం”గా ఈ కవిత్వ పుస్తకాన్ని తెలుగులో అనువదించి సాహిత్య లోకానికి అందజేస్తున్నాము. ఎప్పటిలానే ఈ పుస్తకాన్ని పాఠకులు విశేషంగా ఆదరిస్తారని విశ్వసిస్తూ...
- డాక్టర్ లంకా శివరామప్రసాద్