Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹45

నాన్న జ్ఞాపకాలు

చిత్రంగా అనిపిస్తున్న 'ఫాదర్ గాడ్' ప్రయోగం ప్రయోగశీలి శ్రీశ్రీ కాయిన్... పదమే. మాకూ నచ్చింది. పాఠకులకు నచ్చుతుందనే దాన్ని ఈ పుస్తకానికి పేరు ఉంచాం. విషయం వివరం కోసం 'నాన్న జ్ఞాపకాలు' అనే ఉపశీర్షిక కూడా ఉంచాం.

ఇది నాన్న జ్ఞాపకాలు అంటే నాన్న గురించిన జ్ఞాపకాలు, తనచుట్టూ తాను తిరుగుతూ నాన్న చుట్టూ తిరిగిన శ్రీ జ్ఞాపకాలు. తన జననం నుంచి తండ్రి మరణందాకా!

శ్రీశ్రీ పుట్టిన రోజు ఏప్రిల్ 30, 1910 అని ఇప్పుడు మనం చెప్పుకోడానికి, పాటించ డానికి ఆధారాలున్నాయి. కాని కచ్చితమైన తన పుట్టినరోజు శ్రీశ్రీకి తెలియదు. శ్రీశ్రీ తండ్రికి తెలియదు. కీరీ బతికుండగా మొదలైన దానిపై పరిశోధన శ్రీశ్రీ మరణానంతరం ఫలించింది. దానికి విరసం తరఫున తోధించి, సాధించి సాహిత్యలోకానికి అందించిన శ్రీశ్రీ సాహిత్య పరిశోధక మహాశక్తులు అమరులు కామ్రేడ్స్ కె.వి.ఆర్, చలసాని ప్రసాదు అభినందనీయులు.

ఎవరి తండ్రి వారికి హీరోనే. కాని ఇక్కడ శ్రీశ్రీకి శ్రీశ్రీతండి, శ్రీశ్రీ తండ్రికి శ్రీశ్రీ హీరోలు కావడం ప్రత్యేకత. పరస్పరం ఒకరికొకరు వరం అయ్యారు, జ్వరం అయ్యారు. కావచ్చు.. అయినా సరే శ్రీశ్రీ తన బలాన్ని బలహీనతల్నే కాదు, తన తండ్రి బలాన్ని బలహీనతల్ని కూడా పూసగుచ్చాడు ఇక్కడ . దట్ ఈజ్ శ్రీశ్రీ

ఎనిమిదేళ్ల చిరుప్రాయంలో కందపద్యానికి శ్రీకారం చుట్టాడంటే శ్రీశ్రీబాల్యం సాహి త్యంతో ఎంత పెనవేసుకుపోయిందో తెలుస్తుంది. సాహిత్యంతో చదువు చట్టుబండలో తుందని ఎందరో తంద్రులలాగా ఆందోళన చెందకుండా ఆయన అక్షర క్రీడను ప్రోత్సహిస్తూ సులక్షలు సారం' కొనిపెట్టి దీవించడం సాహిత్య ప్రేమికుడు శ్రీశ్రీ తండ్రికే చెల్లింది. !

నేను బి.ఏ.,పూర్తిచేసి నిరుద్యోగిగా తిరుగుతున్నప్పుడు అప్పటికే దారిద్ర్యం అనే అంధకారం మాజీవితాలలో నిండిపోయి నిబిడీకృతమయినప్పుడు మానాన్న చాలాసార్లు సము, ద్రంలో పడి చచ్చిపోవాలనుకున్నాడట. అయితే తాను లేకపోతే నేనేమయిపోతానో అన్న బెంగకొద్ది తీరందాకా వెళ్లి కూడా ఆత్మహత్యా ప్రయత్నాలు విరమించుకునేవాడట-80

ఇలా ఇలా ఇలాంటివి ఎన్నెన్నో కదిలేవి, కదిలించేవి, పరస్పరానురాగాలాపనలు ఈ ఫాదర్ గార్'లో కోకొల్లలు. మరింక చదివి ఆస్వాదించండి.

- శ్రీ సాహిత్యం, శ్రీశ్రీపై సాహిత్యం రెండోనూరు పుస్తకాల హోరు ప్రణాళికలు అతి సాహిత్యనిధి అందిస్తున్న 105వ పుస్తకం, శ్రీశ్రీ సాహిత్య ఉద్యమయాత్రలాకి ఇంత కలసిరండి, పదిమందినీ కలుపుకురండి. మీవంతూ గొంతు అందించండి................