Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
ప్రతీ నవలకి ఏదో ముందు మాటగా రాయాలి కాబట్టి, రాస్తూంటాను. అకారణంగా నవల వెనకాల కథ, దానికి ప్రేరణ ఏంటో రాస్తాను. ఆనవాయితీగా దీనికి కూడా అంతే.ఈ నవల రాయడానికి, దీని వెనక ఓ చిన్న సంఘటన ఉంది.
ఓసారి నేను దుబాయ్ ఏర్పోర్ట్ లో, హైదరాబాద్ వెళ్ళే ప్లైటు కోసం ఎదురు చూసున్నాను. అక్కడ చాలా మంది నాలాగే హైదరాబాదు వెళ్ళే వాళ్ళే. ఎవరైనా తెలిసిన వాళ్ళు కనిపిస్తారేమోనని అంతా కలయ చూసాను. తెలిసిన వాళ్ళెవరూ కనిపించ లేదు. నాపక్కనున్న ఓ జరీ చీరావిడ ఎదురుగా ఉన్న ఓ పంజాబీ డ్రెస్సావిడని ఎక్కడికి వెళ్తున్నారు మీరు... మీరు అంటూ మాటలు మొదలు పెట్టి, తరవాత వాళ్ళు ఒకరికొకరు స్కూలు నుంచి తెలుసని ఆశ్చర్యపోయి, సంతోషపడి, నవ్వు అంటూ కొనసాగించి, విమానం ఎక్కేవరకూ ఎన్నో సంగతులు చెప్పుకుంటూ నవ్వుకుంటూ ఉన్నారు.
ఒకవేళ వీళ్ళిద్దరూ స్నేహితులు కాకుండా వెతకబోయిన శత్రువు అయితే... నాలుగుసార్లు ఆలోచించి, మూడసార్లు పేజీలు పాడుచేసి, అప్పుడు మొదలు పెట్టడానికి కావలసిన వాక్యాలు రాయగలిగాను.అంతే నవల మొదలు పెట్టాను. ట్విస్టులు ఇవ్వడానికి, సస్పెన్స్ పెంచడానికి కాస్త కష్టపడ్డాను. అంతే.అన్నీ తెలిసినట్లే ఉంటుంది. కాని చేసే తప్పులు చేస్తూనే ఉంటాం. ప్రతి తప్పు వెనక ఓ కారణాన్ని సృష్టించుకుంటాం, ఇదే జరిగింది.