తంగేడుకు బతుకమ్మకు తరతరాల అనుబంధం
తలల తురుముకోకున్నా, తరగని శోభకై తలకెత్తుకునే పువ్వు
గుండెల్లో నింపుకొనేటి నవనవోన్మేషమైన పువ్వు మా తంగేడు
సమ్మెహన వర్ణ సమ్మిళితమై
దృశ్యమాన సంశోభితమై
మగువల మనసు దోచు మా బతుకమ్మ
బతుకమ్మ ఒక స్వేచ్ఛా కేతనం
బతుకమ్మ కుంట ఒక సమ్మిళిత గ్రామ గంధం
ఊరూరి కలల పంట మానవీయ చిత్రం
అంతర్లీన లయ విన్యాసాల
హస్తకళా నైపుణ్యాల
సుందరభావం తంగేడు పూల బతుకమ్మ
బ్రతుకు ప్రతిబింబించు పండగ
ప్రపంచానికే ఆదర్శ పండగ!
- డా. కొండపల్లి నీహారిణి