Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
మార్క్సు కృషి వల్ల ఒక సైన్సుగా అభివృద్ధి చెందిన ఆధునిక అంతర్జాతీయ సోషలిజం, 1844 నాటికి ఇంకా లేదు. నా ఈ పుస్తకం, సిద్ధాంత పిండాభివృద్ధి లోని ఒక దశకు ప్రాతినిధ్యం వహిస్తుంది.”
కొత్త అమెరికా శ్రామిక పార్టీ, మిగిలిన అన్ని చోట్లా వున్న రాజకీయ పార్టీల లాగానే ఏర్పడి, రాజకీయాధికార సాధననే అభిలషించినట్లయితే, ఆ అధికారం సాధించిన తర్వాత దానితో ఏం చేయాలనే విషయం పై ఒక అంగీకారానికి రావడానికి చాలా దూరంలో ఉంది.”
"కార్మిక వర్గ దయనీయ పరిస్థితికి కారణాన్ని, వారి చిన్న చిన్న వెతలలో కాక, పెట్టుబడిదారీ వ్యవస్థలోనే వెతకాలనే మూల సత్యాన్ని (ది గ్రేట్ సెంట్రల్ ఫాక్ట్ ) ఇది మరింతగా స్పష్టం చేస్తున్నది.”
"భూమీ, రైల్వేలూ, గనులూ, యంత్రాలూ మొదలైన ఉత్పత్తి సాధనాలన్నింటినీ, అందరి ప్రయోజనం కోసం, అందరూ ఉమ్మడిగా పనిచేసేటట్లు, మొత్తంగా సమాజం నేరుగా స్వాధీనం చేసుకొనేందుకు వీలుగా, రాజకీయాధికారాన్ని సాధించడమే తన లక్ష్యంగా శ్రామిక వర్గం, తన రాజకీయ విధానం ప్రకటిస్తుంది.”
"పెట్టుబడిదారీ ఉత్పత్తి ఆగడానికి వీల్లేదు. అది అలా పెరుగుతూ విస్తరిస్తూ వెళ్ళాల్సిందే. లేకుంటే చచ్చి తీరాలి.”