Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
కొన్ని జ్ఞాపకాలివి. కలలూ, కలవరింతలూ కలిసి నడిచిన రోజులవి. గులాబీ పూల రేకులు కొన్ని, కన్నీటి బిందువులు మరికొన్ని. ఏలూరు రోడ్డులో రాత్రిపూట చెట్ల కింద కరిగిపోయిన నాటి వెన్నెల నీడలు. వీటిని 'కొన్ని సందర్భాలలో కొందరు మనుషులు' అన్నాడు రచయిత వెంకట్ శిద్ధారెడ్డి, జయకాంతన్ని గుర్తుచేస్తూ. నాకు నచ్చినవీ, హృదయానికి బాగా దగ్గరగా వచ్చినవీ మాత్రమే రాయగలిగాను. వీటికో వరసా పద్దతీ ఏమీ ఉండదు. అప్పటికి ఏది గాఢంగా అనిపిస్తే అదే రాశాను. కవులూ, కథకులూ, కళాకారులూ, సినిమాలూ, సంఘటనలూ.... దేనిగురించి రాసినా కదిలి వెళ్లిపోయిన కాలాన్ని జర్నలిస్టు కళ్లద్దాల్లోంచి చూడటమే! కోపం వస్తే తిట్టి పడేయటం, ప్రేమ పొంగిపొర్లితే కావలించుకుని కన్నీళ్లు పెట్టుకోవడం మనందరి బలహీనత. నా యీ బలమైన బలహీనతని మెచ్చుకోవడంలోనే మీ ఔన్నత్యం దాగి ఉందని గుర్తించే ఔదార్యం ఉంది నాకు.