మా అమ్మమ్మకు కొంత పిచ్చి పుట్టుకతోనే ఆ పిచ్చి ముదిరింది; మరణంగా మారింది. మహా పిసినిగొట్టు మా మామయ్య ఎండు గడ్డితో కప్పాడు అమ్మమ్మని నేలమాళిగలో దాచాడు పంటి యెండినప్పుడు విత్తనంగా పేలింది అమ్మమ్మ నేలమాళిగలోని కిటికి నుంచి
బయటికి దూకింది, ఆ విత్తనం
ఆ విత్తనంలోని ఒక గింజ
ఎలాగోలా మొలకెత్తింది మా అమ్మగా,
ఎవరూ పట్టించుకోకనే.మొలకెత్తింది ఎండావానకు
మా అమ్మ పిచ్చిది.
నేను కూడా.