Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
“ఈ భూమిపై ఉన్నవన్నీ ఎంత సౌందర్యంతో నిండి ఉంటాయి. కొండరాళ్ళు, సెలయేళ్ళు, వృక్షాలు, పచ్చగడ్డి, పూవులు - ఇంకా ఎన్నో అసంఖ్యాకమైన వాటిని ఈ వసుధ ప్రసవిస్తుంటుంది. మనిషి మాత్రం దుఃఖిస్తూ కూర్చుంటాడు. మనిషి మాత్రమే తన జాతిని, తన తోటివారిని హతమారుస్తుంటాడు. తన పొరుగు వాడిని దోపిడీ చేస్తాడు. ఒక్క మనిషి మాత్రమే రాక్షసత్వంతో అన్నీ ధ్వంసం చేస్తుంటాడు. అన్నిప్రాణుల కంటే అతడే అత్యంత దుఃఖితుడు. అత్యంత దౌర్బాగ్యుడు... మనిషిలోని భయాలే అతడి దేవుళ్ళు. అతడి ప్రేమలు అతడిలోని ద్వేషాలు. ఈ సమరాలు లేకుంటే, ఈ భయాలు లేకుంటే ఎంత పరమాద్భుతమైన లోకాన్ని నిర్మించుకోవచ్చునో! -