Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹100

సంస్మరణ

Seshendra Sharma ప్రముఖ సాహితీవేత్త గుంటూరు శేషేంద్ర శర్మ (79) మే 20, మరణించారు. ఆయన 1927లో నెల్లూరులో తోటపల్లి గూడూరు గ్రాములు జన్మించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో డిప్యూటీ మునిసిపల్ కమీషనర్ పనిచేశారు. 'నా దేశం - నా ప్రజలు' 'శేషజ్యోత్స్న', 'రక్తరేఖ', 'గొరిలా ఆధునిక మహాభారతం', 'జనవంశం', 'రుతుఘోష', 'మండేసూర్యుడు స్వర్ణహంస, రామాయణ రహస్యాలు' వంటి రచనలు చేశారు. 'కవిసేన మేనిఫెస్టో ఆయన సుప్రసిద్ధ రచన. ఆయన సాహిత్యకృషికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. 1994లో తెలుగు విశ్వవిద్యాలయం ఆయనకు డాక్టరేట్ ప్రదానం చేసింది. కవిత్వం, సాహిత్య విమర్శ ఇతర వచన రచనలన్నీ కలిపి 40కి పైగా పుస్తకాలు వచ్చాయి.

నాజ్ గిరి సాహచర్యంతో రాణివాసానికి వెళ్ళి సాహిత్య సామ్రాట్ గా మారినట్లు కనిపించినా, ఆయన చివరి దాకా ఎస్టాబ్లిష్ మెంట్ కు దూరంగానే ఉన్నారు. ఉద్యోగం తొలిరోజుల్లో శ్రీకాకుళం జిల్లా ఉద్యోగ సంఘాన్ని ఐ.వి. సాంబశివరావుతో కలిసి నిర్మాణం చేసి కమ్యూనిస్టుగా ముద్రపడి ఆయనను | నిర్బంధ పదవీ విరమణకు గురిచేసింది. 1955 ఆంధ్రా ఉప ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీ వైపు నిలబడిన శ్రీశ్రీ దాదాపు మతిస్తిమితం | కోల్పోయినప్పుడు ఆయనకు అండగా కవిత రాసి ఓటమి తాత్కాలికమే అని

ప్రోత్సహించిన కవి శేషేంద్ర. ఇంక 1991 నుంచి గల్ఫ్ యుద్ధాన్ని ఖండిస్తు | అమెరికా సామ్రాజ్యవాదాన్ని స్థిరంగా వ్యతిరేకించిన శేషేంద్ర నీతులు చెప్పు అమెరికా - ఇది నీ చరిత్ర' అని వ్యాస సంపుటి వెలువరించారు. ఆయన మరణానికి వీక్షణం' తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తోంది.......